Rahul Gandhi slams Centre for saying 'no record' of farmers'deaths మరణించిన రైతులకు పరిహారం ఇవ్వండీ: రాహుల్ గాంధీ

We might need to vaccinate everybody with booster dose rahul gandhi

corona vaccine, Booster dose, Omicron Variant, Rahul Gandhi, Vaccination, compensation, farmers, Narendra Modi, PM Modi, National Politics

Congress leader Rahul Gandhi took a dig at the BJP-led Centre over the new Covid-19 variant omicron from Botswana in southern Africa. Calling the variant a “serious threat”, Rahul said that bad figures of Covid-19 vaccination “can’t be hidden for long.”

ఒమిక్రాన్ వ్యాప్తికి బూస్టర్ డోస్ తో చెక్ పెట్టాలన్న రాహుల్ గాంధీ

Posted: 12/03/2021 07:47 PM IST
We might need to vaccinate everybody with booster dose rahul gandhi

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మవుతున్న నేప‌ధ్యంలో వ్యాక్సిన్ వ్యూహంపై స్ప‌ష్టంగా ఆలోచించాల్సిన అవ‌స‌రం నెల‌కొంద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నూత‌న వేరియంట్‌పై ప్ర‌స్తుతం వాడుక‌లో ఉన్న కొవిడ్‌-19 వ్యాక్సిన్లు క‌చ్చితంగా ప‌నిచేస్తాయ‌ని చెప్ప‌లేమ‌నే ప్ర‌చారం సాగుతోంద‌ని అన్నారు. మ‌నం దేశ ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఎలా పూర్తి చేయ‌ల‌నేదానిపై ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని, మ‌రో బూస్ట‌ర్ డోస్‌తో ముమ్మ‌రంగా వ్యాక్సినేష‌న్ చేప‌ట్టేందుకు సిద్ధం కావడాన్ని అంగీక‌రించాల‌ని సూచించారు.

సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల‌కు ప‌రిహారం విష‌యంలో చేతులెత్తిసిన కేంద్ర ప్ర‌భుత్వ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరణించిన రైతుల జాబితా లేదని పరిహారం ఇచ్చేందుకు నిరాకరించడం ఎంతవరకు సమంజసమని ఆయన కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప‌రిహారం చెల్లించ‌కపోవ‌డంతో పాటు మోదీ స‌ర్కార్ క‌నీసం మ‌ర‌ణించిన రైతుల‌ను గుర్తించ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇది రైతులను అవమానించడం కాకమరేమిటని ప్రశ్నించారు.

రైతుల నిర‌స‌న‌ల్లో మ‌ర‌ణించిన అన్న‌దాత‌ల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ప‌రిహారం చెల్లిస్తుందా అని పార్ల‌మెంట్‌లో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి త‌మ వ‌ద్ద ఎలాంటి రికార్డులు లేనందున అస‌లు ప‌రిహారం ప్ర‌శ్నే ఉత్పన్నం కాద‌ని వ్య‌వ‌సాయ శాఖ బ‌దులిచ్చింద‌ని రాహుల్ మండిప‌డ్డారు. మ‌ర‌ణించిన రైతుల పేర్లు తెలియ‌వ‌ని ప్ర‌ధాని మోదీ అస‌త్యాలు చెబుతున్నార‌ని అన్నారు. ప్ర‌ధాని స్వ‌యంగా తాను పొర‌పాటు చేశాన‌ని అంటూ రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని, ఆయన చేసిన పొర‌పాటుకు 700 మంది రైతులు మ‌ర‌ణిస్తే ఇప్పుడు వారి పేర్లు త‌న‌కు తెలియ‌వ‌ని మోదీ బుకాయిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

వారికి గౌర‌వంగా ద‌క్కాల్సినవి ఇచ్చి మీ హుందాత‌నం కాపాడుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నార‌ని ప్ర‌ధానిని రాహుల్ నిల‌దీశారు. రైతుల ఆందోళ‌న‌లో మ‌ర‌ణించిన 500 మంది రైతుల జాబితాను తాము అంద‌చేస్తున్నామ‌ని మిగిలిన వారి పేర్లు త్వ‌ర‌లో అంద‌చేస్తామ‌ని రాహుల్ చెప్పారు. మ‌ర‌ణించిన రైతుల‌కు స‌భలో సంతాపం తెలిపేందుకు ప్ర‌భుత్వం రెండు నిమిషాల స‌మ‌యం ఇవ్వ‌లేక‌పోయింద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వ‌ద్ద మ‌ర‌ణించిన రైతుల జాబితా లేకుంటే తామిచ్చే జాబితా తీసుకుని బాధిత రైతాంగానికి ప‌రిహారం చెల్లించాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles