బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారగా ఇవాళ మరింత తీవ్రతరమై తీవ్రవాయుగుండంగా మారిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర సహా ఒడిశా తీరప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. ఇది ఇవాళ సాయంత్రానికి తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ్టి సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వేగంగా వీచే ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు చెట్లు నేలకూలే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎల్లుండి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. జవాద్గా పిలుస్తున్న ఈ తుపాను రేపు ఉదయానికి ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుంది. అక్కడి నుంచి ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితిని సమీక్షించారు.
అలాగే, తుపాను పరిస్థితిపై సమీక్షించేందుకు ముగ్గురు అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒక రోజు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నేటి నుంచి ఎల్లుండి వరకు విశాఖలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 65 రైళ్లను అలాగే, నేడు బయలుదేరాల్సిన పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు రద్దు చేయగా, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు.
జవాద్ తుపాను నేపథ్యంలో తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై ప్రధానమంత్రి మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తుపాను ముప్పు తీవ్రంగా ఉండే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రిత్వశాఖలతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమీక్షించారు. కోస్టుగార్డు, నేవీ హెలికాప్టర్లు, నౌకలను సిద్ధం చేశారు. తుపాను శనివారం ఉదయం ఉత్తరాంధ్ర ఒడిశాలోని దక్షిణకోస్తాల మధ్య తీరం దాటుతుందని అధికారులు తెలిపిన నేపథ్యంలో ఆయా ప్రాంత అధికారులను అప్రమత్తంగా ఉండి.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more