Man makes hall as swimming pool takes bath watching TV వైరల్ వీడియో: వరదనీటితో చెరువైన ఇంట్లోనే వ్యక్తి స్నానం..

Viral video man takes bath in hall watching tv ponded with flood water

man takes bath in hall, man house ponded with flood water, man takes bath in flood water, man takes bath watching tv, Man, chennai floods, bathing viewing TV, television, funny video, trending video, Viral video, video viral

A Man from Tamil Nadu makes his dream come true as he takes bath in his house in Hall area viewing the Television. His prays to god for making his dream come true due to the recent floods in chennai.

ITEMVIDEOS: వైరల్ వీడియో: వరదనీటితో చెరువైన ఇంట్లోనే వ్యక్తి స్నానం..

Posted: 12/02/2021 09:26 PM IST
Viral video man takes bath in hall watching tv ponded with flood water

భలేఛాన్సులే.. భలేఛాన్సులే భలేఛాన్సులే.. లలలాం లలలాం లక్కీఛాన్సులే భలేఛాన్సులే.. ఈతకొలను ఉన్న మజా.. అందులో స్నానం చేస్తేనే తెలియునులే.. అదేంటి ఇల్లరికంలో వున్న మజా.. కదా.. అంటారా.. ఔనండీ అది ఇల్లరికమే కానీ.. ఈతకొలను అని ఎందుకుమార్చామంటే.. తాము వినడమే తప్ప.. చూడనిది. అందులోనూ ఆస్వాదించనిది ఎదురైన నేపథ్యంలో పాటలను తమకు అనుకూలంగా మార్చుకుని పాడటం సామాన్యులకు అలవాటే. అలానే ఈ వీడియోలోని ఓ వ్యక్తి కూడా తనకు కలిగిన సంతోషం.. ప్రకృతి ప్రళయం ద్వారా వచ్చిన అవకాశం నేపథ్యంలో హాయిగా స్నానం ఆచరిస్తూ పాడుకునే పాటే భలేఛాన్సులే.

అదేంటి అంటే.. పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లలో ఈతకోలను ఉంటాయని వినడమే తప్ప.. వాటిని చూసింది కానీ.. వాటిలో స్నానం చేసింది కానీ లేదు. కానీ చెన్నైలో ఇటీవల కురిసిన వర్షాలకు అసాధ్యమని భావించిన దిగువ మధ్యతరగతి కుటుంబంలోని ఓ వ్యక్తి ఎంచక్కా తన ఇంటి హాలునే స్మిమ్మింగ్ పూల్ లా మారడంతో ఎంచక్కా అక్కడే స్నానం చేశాడు. తన ఇంట్లో టీవీలో కార్యక్రమాలను వీక్షిస్తూ.. ఒంటికి సబ్బు రాసుకుని మరీ సాన్నం చేస్తున్నాడు. ఈ వీడియోను ఎప్పుడో తీసినా.. తాజాగా నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. వరుణ దేవుడా సామాన్యుల ఈతకోలను కొరికను తీర్చినందుకు ధన్యవాదాలు అంటూ కాప్షన్ పెట్టారు. ఇంక మధ్యతరగతి వ్యక్తి ఆనందం ఎలాంటిదో మీరూ ఈ వీడియో చూస్తూ మీకు ఇట్టే అర్థమవుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  chennai floods  bathing viewing TV  television  funny video  trending video  Viral video  

Other Articles