Passenger rescued from accident after getting off moving train వృద్ద మహిళను కాపాడిన రైల్వే పోలీసు

Brave rpf officer saves woman from crushing under train at purulia station in west bengal

moving train, rpf constable, woman fallen from train, woman boarding a running train, rpf officer Purulia railway station, rpf woman constable saves woman, constable rescues woman passenger, Santragachi-Anand Vihar Express, constable saves woman falling under train, rpf officer saves life, Purulia Railway station, woman passenger, running train, RPF SI Bablu Kumar, CCTV footage, Netizens, viral video, Indian Railway Videos, RPF Officer Saves Life Of A woman, Viral Video Of Train, Crime

A Railway Protection Force (RPF) officer, on duty at Purulia station in Bengal, saved the life of a woman who was seen jumping off the moving train. In a CCTV footage tweeted by the Railways, two women are seen jumping off the Santragachi-Anand Vihar Express just as it gathers speed.

ITEMVIDEOS: పట్టాలపై పడకుండా వృద్ద మహిళను కాపాడిన రైల్వే పోలీసు

Posted: 12/03/2021 12:45 PM IST
Brave rpf officer saves woman from crushing under train at purulia station in west bengal

క్షణకాలంలో జీవితం ముగిసిపోయిందే అని భావన కలిగే ఘటనలు కొందరికి ఎదురవుతుంటాయి. ఇక జీవితం ముగిసిపోయిందే అని పెద్ద అపద నుంచి తప్పించుకున్నప్పుడు.. లేదా ప్రాణాపాయస్థితి నుంచి తృటిలో బయట పడినప్పుడు అనుకుంటాం. మరణపు అంచుల వరకు వెళ్లివచ్చామన్న ఫీలింగే.. ఆ క్షణంలో ఎధురయ్యే గుండెదడ వివరించలేదే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పూరిలియా రైల్వేస్టేష‌న్ లోనూ ఓ మహిళకు కూడా అదే అనుభవం ఎదురైంది. కదులుతున్న రైలు.. వేగాన్ని అందుకుంటున్న సమయంలో దానిని దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. అనుకోకుండా మరణపు అంచుల వరకు వెళ్లింది. అయితే సకాలంలో స్పందించిన ఆర్సీఎఫ్ ఎస్ఐ అమెను కాపాడారు.

ఓ మహిళ రైలు దిగడాన్ని గమనించిన ఆయన.. అమె పక్కకు పడిందని ఊపిరి పీల్చుకునే లోపు మరో మహిళ కూడా అదే పని చేసి ఫ్లాట్ ఫాంపై పడి.. కిందపడిన అమెను క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగుపరుగున వచ్చిన రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారి అమెను చటక్కున పక్కకులాగి రైలు కింద పడనీయకుండా చేశాడు. మరో విధంగా చెప్పాలంటే అమె ప్రాణలతో సురక్షితంగా ఉందంటే.. ఆ అధికారి కాపాడటం వల్లే. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 29న  మధ్యాహ్నం సరిగ్గా రెండు గంటలకు పూరుల్యా రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫామ్ నెంబరు 4లో సంట్రాగచ్చి-ఆనంద్ విహార్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరేందుకు సిద్దంగా వుంది. అదే సమయంలో పురిలియాకు చెందిన ఇద్దరు మహిళలు రైలు ఎక్కారు.

అయితే వారితో పాటు రైలు ఎక్కాల్సిన మరో వ్యక్తి రైలును అందుకునే లోపే అది కాస్తా ముందుకు కదిలింది. దీంతో ఆయన వారిని రైలు దిగాలని సైగా చేశాడు. అంతే వారు వెనకాముందు ఆలోచించకుండా రైల్లోంచి కిందకు దిగారు. ముందుగా దిగిన ఓ మహిళ దిగడంతోనే కిందపడింది. అయితే అమె కాసింత దూరం వెళ్లడంలో రైలు కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకుంది. కాగా అమె వెంటనే దిగిన మరో మహిళ రైలు అప్పటికే వేగాన్ని అందుకోవడంతో.. ఏమాత్రం దిగే అవకాశం లేకపోయినా దిగేసింది. దీంతో అమె వెంటనే కిందపడింది. ఇక రైలు కింద పడే ప్రమాదం కూడా ఉంది. ఇది గమనించిన రైల్వే అధికారి బబ్లూ కుమార్ వెంటనే పరుగుపరుగున వెళ్లి.. అమెను రైలుకు, ఫ్లాట్ ఫామ్ కు మధ్యనున్న గ్యాప్ లో పడకుండా కాపాడాడు. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం దిగడం రెండూ ప్రమాదకరమేనని ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రయాణికులకు మరోమారు సూచించారు.

ఈ ఘటనకు సంబంధించిన సిసిటీవి దృశ్యాలను రైల్వేశాఖ తమ సామాజిక మాద్యమాల్లో పెట్టింది. దీంతో ప్ర‌యాణికురాలి ప్రాణాలు కాపాడిన రైల్వే పోట్రోక్షన్ ఫోర్స్ అధికారి బబ్లూ కుమార్ పై నెటిజనులు ప్రశంసలు కురుస్తున్నాయి. రద్దీగా వుంటే పురుల్యా రైల్వేస్టేషన్లో రైల్వే భద్రతా సిబ్బంది బృందాలు ఎంతో అప్రమత్తంగా వుంటాయని బబ్లూ కుమార్ మరోమారు నిరూపించాడు. ఆర్పీఎఫ్ ఎస్ఐ బబ్లూ కుమార్ పై రైల్వే ఉన్న‌తాధికారులు, ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో పాటు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడీయోను నెట్టింట్లో అప్ లోడ్ చేసిన పోలీసులు.. క్షణకాలం తొందరతో ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని కూడా సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles