Omicron Variant Spread Widely At a Faster Pace శరవేగంగా విస్తరిస్తున్న ‘ఒమిక్రాన్’.. ఒక్కరోజులో రెట్టింపైన కేసులు

New findings show the omicron variant spread widely at a faster pace

COVID-19, Omicron, variant, Omicron B.1.1.529, covid new variant, RT-PCR Test, Rapic Test, covid new mutation, spike protein, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, medical information, isolation protocol, single-day spike, Covaxin, dexamethasone, health ministry, recoveries, positivity rate, safety measures, coronavirus detection, SARS-CoV-2 virus, SARS-CoV-2, medicines, Omicron, South Africa, Botswana, Hong kong, covid news, corona updates

New findings about the coronavirus’s omicron variant made it clear that the emerging threat slipped into countries well before their defenses were up, as two distant nations announced their first cases and a third reported its presence before South African officials sounded the alarm.

శరవేగంగా విస్తరిస్తున్న ‘ఒమిక్రాన్’.. ఒక్కరోజులో రెట్టింపైన కేసులు

Posted: 12/02/2021 12:32 PM IST
New findings show the omicron variant spread widely at a faster pace

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ నవంబర్ నెలాఖరులో వెలుగుచూసిందన్న విషయంలో వాస్తవం లేదని.. గత అక్టోబర్ నెలలోనే ఇది వెలుగుచూడటంతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల్లోని దాదాపుగా 20 దేశాలకు కూడా విస్తరించిందని తాజాగా కొ్త్త విషయాలు వెలుగుచూసాయి. ఇక దీని తీవ్రతపై కూడా బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ప్రాణంతకమైన వైరస్ అని పేర్కొంటుండగా, మరికోందరు మాత్రం ఇది అంత తీవ్రమైనది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా యూరోప్ దేశాలలో ఏకంగా 44 కేసులు నమోదు కావడం ఇందుకు ఊతమిస్తోంది.

ఒమిక్రాన్ వైరస్ దక్షిణాఫ్రికాతో పాటు యావత్ దేశాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజులోనే అక్కడ కేసుల సంఖ్య రెండితలు కావడం అందోళనకు గురిచేస్తోంది. గత వేరియట్లతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న వార్తలను నిజం చేస్తూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం 4373 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా అవి మరుసటి రోజుకి ఏకంగా 8561కి చేరుకున్నట్లు అధికారిక గణంగాకాలు వెల్లడించాయి. ఇక అనధికారికంగా ఈ కేసులతో ఇంటికే పరిమితమైన వారి సంఖ్య ఎంతో కూడా తెలియాల్సి వుంది. డెల్టా వేరియంట్ తరహా కన్నా వేగంగా ఇది వ్యాపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఒమిక్రాన్ కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మున్ముందు ఈ కేసుల సంఖ్య రెండింతలు, మూడింతలకు పెరగడాన్ని మనం చూస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రాంతీయ వైరాలజిస్ట్ డాక్టర్ నిక్సీ గుమెడె-మోలెట్సీ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో నవంబరు నెల ప్రారంభంలో కొత్త కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వారపు సగటు రోజుకు 200 కేసులుగా నమోదైంది. అయితే, నెల మధ్య నుంచి కేసులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నవంబరు మొదట్లో కొత్త కేసులు ఒక్క శాతంగా ఉంటే నిన్న అవి ఏకంగా 16.5 శాతానికి పెరిగాయి.

ఒమిక్రాన్ గురించి దక్షిణాఫ్రికా యావత్ ప్రపంచాన్ని అలర్ట్ చేసేందుకు ముందే ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ పాకిపోయిందని తెలుస్తోంది. అక్టోబర్ లోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన అనేక మందికి ఈ మహమ్మారి సోకిందని తేలింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేసిన నమూలను సేకరించిన నైజీరియా.. తాజాగా ఈ నమూనాలను పరీక్షించగా అందులో ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారణ అయ్యిందని ఆ దేశ జాతీయ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. ఇదే విధంగా సౌధీ అరేబియాలోనూ ఓ కేసు భయటపడింది. కాగా ఒమిక్రాన్ ఫ్రభావిత దేశాల నుంచి ఏకంగా 3476 మంది భారత్ చేరుకోగా వారిలో ఆరుగురికి కరోనా సోకిందని నిర్థారణ అయ్యింది. మరి వీరికి సోకింది ఒమిక్రానా.? కాదా అన్నది నిర్థారించాల్సివుంది.

ఇక ఇదే తరుణంలో అగ్రరాజ్యం అమెరికాకూ కూడా ఒమిక్రాన్ పాకింది. దక్షిణాఫ్రికా నుంచి కాలిఫఓర్నియాకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా ఉందని, అతడ్ని పరీక్షంచగా అతనికి ఒమిక్రాన్ వేరియంట్ గా తేలిందని అక్కడి వైద్యులు వైట్ హౌజ్ కు సమాచారం అందించారు. నవంబర్ 22న బాధితుడు అమెరికాకు వచ్చాడని, సోమవారం కరోనా పాజిటివ్ అని తేలగా.. జన్యువిశ్లేషణ ద్వారా అది ఒమిక్రాన్ అని తేలిందన్నారు. కాగా బాధితుడు రెండు మోడార్నా వ్యాక్సీన్ డోసులు తీసుకున్నాడని కూడా తెలిపారు. అయితే అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజలందరూ కరోనా వాక్సీన్ డోసులు వేసుకోవాలని.. రెండు డోసులు తీసుకన్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles