Annual Brahmotsavams at Padmavathi Ammavari temple ఆదిలక్ష్మి అలంకారంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు

Karthika masam brahmotsavams at padmavathi ammavari temple in tiruchanoor

Tirumala Tirupati Devasthanam, Tirumala darshan, Padmavati Temple, Tiruchanoor, Tiruchanoor annual brahmostavam, Tiruchanoor karthika brahmotsavam, padmavati ammavaru, Adilakshmi avataram, pearl vahanam, muthyala vahanam, covid restrictions, Piligrims, Tirumala darshan, Tirumala Package, AP Tourism, Tirumala tirupati devasthanam, TTD Board, Dharma reddy, devotional

The annual Navahnika Karthika Brahmotsavams of Padmavathi Ammavaru at Tiruchanoor, are being held grandly under the supervision of Pancharatra Agama Advisor K Srinivasacharyulu. As a Part on Third day of Brahmotsavam Godess Padmavathi had given darshan as AdiLakshmi on Muthyala Vahanam to devotees.

ముత్యాల పందిరిపై ఆదిలక్ష్మి అలంకారంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు

Posted: 12/02/2021 11:07 AM IST
Karthika masam brahmotsavams at padmavathi ammavari temple in tiruchanoor

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనంకోసం వచ్చే భక్తజనకోటిలో కొంతమందైనా తిరుచానూరులో కొలువైన పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకన్న భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వెళ్లడం ఆనవాయితీ. అయితే దాదాపుగా శ్రీవారిని దర్శించిన యాభై శాతం మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి రారు. యితే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించే రోజుల్లో మాత్రం ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు.

ప్రస్తుతం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు హాజరవుతున్నారు. కాగా కార్తీక బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శంఖుచక్రాలతో భక్తులకు అభయప్రధానం చేశారు. కరోనా నేపథ్యంలో ఆల‌యం వ‌ద్దగ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మవారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది. కాగా రేపు అమ్మవారికి గజవాహన సేవ నిర్వహించనుండగా, శనివారం రోజున గరుడవాహన సేవను నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles