Commercial LPG cylinder price increased by over ₹100 చమురు సంస్థల షాక్.. కమర్షియల్ సిలిండర్లపై మళ్లీ వడ్డన

Commercial lpg cylinder to cost more than rs 2 100 after latest hike

Delhi, LPG gas cylinder price, lpg gas price hiked, lpg gas price hiked in delhi, latest business news updates, gas cylinder price rise, gas cylinder price rise in delhi, gas cylinder price rise news,gas cylinder price rise latest news updates

Liquefied petroleum gas (LPG) prices for commercial cylinders were increased by ₹ 100.50 on Wednesday. In the national capital, 19-kg commercial cylinders will now cost ₹ 2,101 compared to the previous rate of ₹ 2,000.50. The prices were last hiked by ₹ 266.50 on November 1.

చమురు సంస్థల షాక్.. కమర్షియల్ సిలిండర్లపై మళ్లీ వడ్డన

Posted: 12/01/2021 04:51 PM IST
Commercial lpg cylinder to cost more than rs 2 100 after latest hike

క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ వినియోగ‌దారుల‌కు చ‌మురు సంస్థ‌లు షాకిచ్చాయి. కరోనా కష్టకాలంలో వ్యాపారాలు డీలా పడటంతో.. అప్పులు చేసి మరీ వ్యాపారాలను నడిపిస్తున్న హాస్పటాలిటీ రంగంతో పాటు స్టార్ హోటళ్లు, చిరు వ్యాపారులు ఇత్యాదులందరిపై మరింత ప్రభావం పడే విధంగా చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కష్టకాలంలో దేశ ప్రజలకు అండగా నిలవాల్సిందిపోయి.. వ్యాపారాపేక్ష ధోరణితోనే వ్యవహరిస్తూ.. కోట్లాది మంది చిరువ్యాపారులను అయిల్ సంస్థల నిర్ణయం ప్రభావితం చేస్తోంది. ఫలితంగా ఆ ప్రభావం కూడా పరోక్షంగా దేశ ప్రజలపైనే పడనుంది. తాజాగా దేశంలో క‌మ‌ర్షియ‌ల్‌ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రలు మ‌ళ్లీ పెరిగాయి.

19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ.100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయని వెల్ల‌డించాయి. తాజా పెంపుతో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,101కి చేరింది. అయితే, 14.2 కేజీ, 5 కేజీ, 10 కేజీ కమర్షియల్ సిలిండర్​ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని చ‌మురు సంస్థ‌లు తెలిపాయి. అదేవిధంగా ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో కూడా ఎటువంటి మార్పు చేయ‌లేద‌ని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. కాగా, నవంబరు 1న కూడా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.266 పెరిగింది. అంత‌కుముందు సెప్టెంబర్‌ 1న రూ.75 పెంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LPG rates  Commercial LPG  Commercial LPG rates  lpg gas price hike  Commercial LPG news  

Other Articles