No data on farmers' death during protests, so no compensation ఆ రైతు మరణాలకు ఆర్థిక సాయం కుదరదు: కేంద్రం

No data on farmers who died so no compensation says govt in parliament

Farmers protest, Compensation, Farmers death during protest, Union government, Narendra Singh Tomar, Union Minister of Agriculture, Agitation of Farm Laws, financial assistance, Rakesh Tikait, repeal of farm laws, National Politics

The government said it has no data pertaining to either cases against or the number of farmers who died during the year-long agitation demanding repeal of the three contentious farm laws and hence there was no question of providing financial assistance to anyone.

మరణించిన రైతులకు ఆర్థిక సాయంపై చేతులెత్తేసిన కేంద్రం

Posted: 12/01/2021 03:58 PM IST
No data on farmers who died so no compensation says govt in parliament

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఏడాదిపాటు జ‌రిగిన ఆందోళ‌నల్లో మ‌ర‌ణించిన 750 మంది రైతుల‌కు ఆర్థిక సాయం అందించ‌డం కుద‌ర‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఆందోళ‌న‌ల్లో మ‌ర‌ణించిన రైతులకు రూ.25 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తున్నారా లేదా..? అని ప్ర‌తిప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ఈ మేరకు లిఖితపూర్వక స‌మాధానం ఇచ్చారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేస్తూ మ‌ర‌ణించిన రైతుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డులు లేవ‌ని, కాబ‌ట్టి వారికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డం సాధ్యం కాద‌ని ఆయన పేర్కొన్నారు.

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు దేశరాజధాని ఢిల్లీ శివారల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాగా ఏడాది సమయం కావస్తున్న తరుణంలో కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు వీరి నిరసనలకు తలొగ్గి సాగుచట్టాలను ఉపసహరించుకుంది. అయితే.. గత ఏడాది కాలంగా చలికి వణుకుతూ.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. కరోనా లాంటి కనిపించని శత్రువు పంజా విసురుతున్నా వెన్నుచూపకుండా అక్కడే తిష్టవేసి నిరసనలు తెలిపారు. అయితే ఈ క్రమంలో కొందరు అందోళన చెంది బలవన్మరణాలకు పాల్పడితే.. నిరసనల్లో భాగంగా కొందరు అనారోగ్యం బారిన పడి మరణించారు.

మొత్తంగా గత ఏడాది కాలం నుంచి మొత్తంగా 750 మంది రైతులు నిరసనదీక్ష స్థలితో పాటు ఆయా రాష్ట్రాల్లోనూ నిరసనలు చేపట్టి మరణించారు. మరికోందరు మాత్రం అందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా ఉద్యమించగా, వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో కొందరు తమ కార్లతో కూడా తోక్కించేశారు. ఇలా కూడా ఎనమిది మంది రైతులు మరణించారు. అయితే సాగుచట్టాలను వెనక్కి తీసుకన్న ప్రభుత్వం.. ఏడాది కాలంగా నిరసనలు చేపట్టి మరణించిన రైతులకు పరిహారం అందిస్తారా.? అని ప్రశ్నించాగా, వారి మరణాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని.. అందుచేత పరిహారం చెల్లించలేమని పార్లమెంటులో కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రికార్డులు లేనందున ప్ర‌తిప‌క్షాలు ఇక‌పై ఆ ప్ర‌స్తావ‌న తేవొద్ద‌ని మంత్రి కోరారు.

కేంద్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి ప్ర‌క‌ట‌నపై కాంగ్రెస్ రాజ్య‌స‌భాప‌క్ష నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే కేంద్ర ప్రకటనను త‌ప్పుప‌ట్టారు. రైతుల మ‌ర‌ణాలకు సంబంధించి రికార్డులు లేవ‌ని చెప్ప‌డం వారికి తీవ్ర అవ‌మాన‌మ‌న్నారు. కేంద్రం అలాంటి ప్ర‌క‌ట‌న ఎలా చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం ఆందోళ‌నల్లో చ‌నిపోయిన 700 మంది రైతుల డేటానే సేక‌రించ‌లేక‌పోతే.. క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి ప్రాణాలు కోల్పోయిన ల‌క్ష‌ల మంది డేటాను క‌రెక్టుగా సేక‌రించింద‌ని ఎలా న‌మ్మ‌గ‌ల‌మ‌ని ఖ‌ర్గే అనుమానం వ్య‌క్తం చేశారు. గ‌డిచిన రెండేండ్ల‌లో క‌రోనా కార‌ణంగా 50 ల‌క్ష‌ల మందికిపైగా ప్రాణాలు కోల్పోతే.. ప్ర‌భుత్వం మాత్రం కేవ‌లం నాలుగు ల‌క్ష‌ల మంది మాత్ర‌మే మ‌ర‌ణించిన‌ట్లు చెబుతున్న‌ద‌ని ఆయ‌న‌ విమ‌ర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh