Man hides in landing gear of flight from Guatemala to Miami వైరల్ వీడియో: విమానచక్రాల గేర్ బాక్సులో నక్కి అమెరికాలోకి..

Video of airport crew s discovery of stowaway in landing gear viewed over 320k times

Guatemala, American Airlines, Airport, Airlines, Stowaway, Miami International Airport, Miami, Airplane, travel, air travel, airplanes, immigration, ICE,Immigration and Customs Enforcement, Viral Video, Trending video

A video of airport employees interacting with a stowaway they found hiding in the landing gear of an American Airlines flight Saturday morning at Miami International Airport has been viewed more than 320,000 times on Instagram. Witnesses said the man, not identified, appeared unharmed after the two-and-a-half hour flight from Guatemala, according to Only in Dade, the local social media account that obtained and posted the video.

ITEMVIDEOS: వైరల్ వీడియో: విమానచక్రాల గేర్ బాక్సులో నక్కి అమెరికాలోకి..

Posted: 11/29/2021 08:42 PM IST
Video of airport crew s discovery of stowaway in landing gear viewed over 320k times

అమెరికాలోకి వలసోచ్చి ఏదో ఒక పని చేసుకుని తమ పొట్ట నింపుకోవాలని భావించేవారు ఎందరో. అయితే ఇలా భావించేవారందరూ అమెరికాలోకి వస్తున్నాం అనుమతించండీ అంటూ ఆ దేశ విదేశాంగ శాఖకు అర్జీ పెట్టుకుని.. వారి అనుమతితో ప్రవేశించాల్సి వుంటుంది. ఇలా అనేక దేశాల నుంచి కోకోల్లలు అగ్రరాజ్యానికి వలసవెళ్తున్నారు. అయితే అమెరికాలోకి వెళ్లేందుకు తనకు అనుమతి లేదో లేక.. విమాన చార్జీలకు డబ్బులు లేవో లేక ఈ రెండూ కారణం కావచ్చునో తెలియదు కానీ.. ఓ వ్యక్తి అమెరికాలోని మియామి విమానాశ్రయంలోకి అడుగుపెట్టేశాడు. ఒక్క వీసా కానీ, విమాన టికెట్ కానీ లేకుండానే ఎంచక్కా ఎగిరిపోయాడు.

అదెలా అంటారా.. గ్వాటెమాలా... మెక్సికోను ఆనుకుని ఉండే చిన్నదేశమిది. దీని రాజధాని గ్వాటెమాలా సిటీ. ఇక్కడ్నించి అమెరికాలోని మయామీ నగరానికి సుమారు 1,640 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతదూరం విమానంలో కూర్చుని ప్రయాణించడం కొద్దిగా కష్టం అనుకుంటే, ఓ వ్యక్తి విమానం టైర్ల వద్ద దాక్కుని గ్వాటెమాలా సిటీ నుంచి మయామీ రావడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. గత శనివారం మయామీ ఎయిర్ పోర్టులో గ్వాటెమాలా సిటీ నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండైంది. ప్రయాణికులు దిగేందుకు సిద్ధమవుతుండగా, ఓ వ్యక్తి విమానం టైర్ల వద్ద నుంచి నడుచుకుంటూ వచ్చాడు.

అతడిని చూసి ఎయిర్ పోర్టు సిబ్బంది నివ్వెరపోయారు. అతడిని ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడైంది. గ్వాటెమాలా నుంచి విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని వచ్చానని వెల్లడించాడు. వాస్తవానికి విమానం టేకాఫ్ తీసుకోగానే ల్యాండింగ్ గేర్ లోపలికి మూసుకుపోతుంది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండా ల్యాండింగ్ గేర్ వద్ద దాక్కుని దాదాపు రెండున్నర గంటలు ప్రయాణించడం పట్ల సిబ్బంది విస్మయానికి గురయ్యారు. కొన్ని అడుగులు వేసిన అతడు నిలుచుకోలేక కూర్చుండిపోయాడు. అయితే ఎయిర్ పోర్టు సిబ్బంది ఫిర్యాదుతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని అక్రమ వలసదారుడిగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles