Bitcoin will not be accepted as currency: FM Sitharaman ‘‘బిట్ కాయిన్ ను భారత్ కరెన్సీగా గుర్తించేది లేదు’’

No proposal to recognise bitcoin as a currency in india fm nirmala sitharaman

Cryptocurrency, Cryptocurrency ban, Finance Minister, Finance Minister Nirmala Sitharaman, Nirmala Sitharaman, Bitcoin, Crypto assets, Crypto trading

Responding to a question in the Lok Sabha, Finance Minister Nirmala Sitharaman said that the government has no proposal to recognise Bitcoin as a currency in the country. She also informed the Lok Sabha that the government does not collect data on Bitcoin transactions.

‘బిట్ కాయిన్’ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన లేదు: నిర్మలా సీతారామన్

Posted: 11/29/2021 07:19 PM IST
No proposal to recognise bitcoin as a currency in india fm nirmala sitharaman

క్రిప్టో క‌రెన్సీ మేజ‌ర్ బిట్ కాయిన్ ను క‌రెన్సీగా గుర్తించాల‌న్న ప్ర‌తిపాదనేదీ ప్ర‌భుత్వం దృష్టికి రాలేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభ‌మ‌య్యాయి. లోక్‌స‌భ‌లో స‌భ్యులు సుమ‌ల‌తా అంబ‌రీష్‌, డీకే సురేశ్ త‌దిత‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధాన‌మిస్తూ బిట్ కాయిన్ ఒక డిజిట‌ల్ క‌రెన్సీ అని చెప్పారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు, థ‌ర్డ్ పార్టీల భాగ‌స్వామ్యం లేకుండా వ‌స్తువులు, సేవ‌ల కొనుగోలుకు, న‌గ‌దు బ‌దిలీకి బిట్ కాయిన్ వాడుతున్నార‌ని తెలిపారు.

దేశంలో క్రిప్టో క‌రెన్సీ లావాదేవీల నియంత్ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం.. క్రిప్టో క‌రెన్సీ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ అఫిషియ‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ బిల్లు-2021ను ప్ర‌స్తుత స‌మావేశాల్లోనే ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించ‌నుంద‌ని వార్త‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో నిర్మ‌లా సీతారామ‌న్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. దేశంలో గ‌తేడాది ఏప్రిల్ నాటికి తొమ్మిది కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల క్రిప్టో క‌రెన్సీ లావాదేవీల ట‌ర్నోవ‌ర్.. ప్ర‌స్తుతం 100 కోట్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. ఆదాయం ప‌న్ను చ‌ట్టం-1961 కింద క్రిప్టో క‌రెన్సీల‌పై ప‌న్ను వ‌సూలు చేయ‌డానికి ఎటువంటి నిబంధ‌న‌ల్లేవు.

దీనిపై త్వ‌ర‌లో ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న క్రిప్టో క‌రెన్సీ నియంత్ర‌ణ బిల్లుతో క్లారిటీ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఆదాయం ప‌న్ను చ‌ట్టం కింద స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌లు లేకున్నా.. వ్యాపారం నుంచి లాభాలు, ప్ర‌యోజ‌నాలు గానీ, క్యాపిట‌ల్ అసెట్స్ విక్ర‌యంతో వ‌చ్చే క్యాపిట‌ల్ గెయిన్స్‌ను ఆదాయంగా నిర్వచించి ప‌న్ను విధించొచ్చు. క్రిప్టో క‌రెన్సీల్లో స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ కాలిక పెట్టుబ‌డుల ప్రాతిప‌దిక‌న క్యాపిట‌ల్ గెయిన్స్ టాక్స్ విధించ‌డానికి ఆస్కారం ఉంది.

ఇప్పుడు 36 నెల‌లు దాటిన పెట్టుబడుల‌ను దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులుగా ప‌రిగ‌ణిస్తారు. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌పై 20 శాతం, మూడేండ్ల లోపైతే శ్లాబ్ రేట్ల ప్ర‌కారం ప‌న్ను విధించొచ్చు. చ‌ట్టం రూపొందించే వ‌ర‌కు క్రిప్టో కరెన్సీల‌ను క్యాపిట‌ల్ అసెట్స్‌గా ప‌రిగ‌ణిస్తూ ప‌న్ను విధించొచ్చున‌ని మార్కెట్ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి. వాటిని విదేశీ ఆస్తులుగా ప‌రిగ‌ణించాలా.. వ‌ద్దా అన్న విష‌య‌మై క్లారిటీ లేదు. డిజిట‌ల్ క‌రెన్సీల స‌ర్వ‌ర్ల లొకేష‌న్ ఆధారంగా స‌ద‌రు మ‌దుప‌ర్ల మూలాల‌ను గుర్తించ‌వ‌చ్చున‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles