Omicron symptoms and prevention tips ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు ఇలా.. పాటించాల్సిన జాగ్రత్తలూ ఇవే.!

Experts share omicron symptoms and prevention tips against the new strain

coronavirus, covid-19, Omicron, delta variant, covid vaccine, omicron covid variant, omicron variant, new covid strain, omicron signs, omicron variant symptoms, omicron variant prevention, covid appropriate behaviour, WHO, omicron symptoms, omicron prevention, Omicron new covid strain

The coronavirus pandemic has taken the world by storm – be it the economy or healthcare sector. Every passing year, a new variant strikes and after the Delta variant wreaked havoc in the second wave of COVID-19, OMICRON is the newest strain that has taken the world by storm.

ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు ఇలా.. పాటించాల్సిన జాగ్రత్తలూ ఇవే.!

Posted: 11/29/2021 06:26 PM IST
Experts share omicron symptoms and prevention tips against the new strain

కరోనా వైరస్ నుంచి తాజాగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ రకం మహమ్మారిని తొలుత గుర్తించారు. ఆ తర్వాత పలు ఆఫ్రికా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇజ్రాయల్, హాంకాంగ్, బోట్స్ వానా, బెల్జియం తదితర దేశాల్లో కూడా ఈ వేరియంట్ ను గుర్తించారు. తాజాగా భారత్ లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ ను గుర్తించారు. ఈ వైరస్ మన దేశంలో కూడా ప్రవేశించిన నేపథ్యంలో... అందరూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

ఒమిక్రాన్ వైరస్ బారిన పడినవారిలో తొలుత అలసటగా ఉంటుంది. ఒంటి నొప్పులు, గొంతులో కొద్దిగా గరగరగా ఉండటం, పొడి దగ్గు, కొద్ది పాటి జ్వరం కూడా ఉంటుంది. చాలా మటుకు చికెన్ గున్యా లక్షణాలే ఉంటాయి. కరోనా తొలి వేవ్ లో వైరస్ బారిన పడిన వారికి కూడా ఒమిక్రాన్ సోకవచ్చు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడిన వారికి ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకినా చాలా మందికి తెలియకుండానే పోతుంది.

అయితే వైరస్ బారిన పడిన వారు ధైర్యంగా ఉండాలి. భయపడితే వారి పాలిట ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఒమిక్రాన్ డెల్డా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. శారీరక వ్యాయామం, డీ విటమిన్ కోసం ఎండలో నడవడం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శాఖాహారులు విటమిన్ బీ12 తీసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles