UP teacher eligibility test cancelled hours before start ఉత్తర్ ప్రదేశ్ టెట్ పశ్నాపత్రం లీక్: 29 మంది అరెస్టు..

Up tet paper leak 29 arrested yogi adityanath invokes gangster act against accused

TET paper leak, UP TET paper in Whatsapp, Yogi Adityanath, uptet, UPTET 2021, UPTET 2021 admit card, UPTET 2021 exam date, UPTET 2021 exam pattern, UPTET 2021 guidelines, UPTET 2021 syllabus, up special task force, Gangsters Act, bjp, bsp, bulandshahr, Uttar Pradesh

The UP Teacher Eligibility Test (TET) was cancelled hours before it was due to start across Uttar Pradesh after it was discovered that the question paper had been allegedly leaked, catching about two million aspirants who had reached the examination centres unawares.

ఉత్తర్ ప్రదేశ్ టెట్ పరీక్ష: 29 మంది అరెస్టు.. అందరిపై గ్యాంగ్ స్టర్ సెక్షన్లు..

Posted: 11/29/2021 03:51 PM IST
Up tet paper leak 29 arrested yogi adityanath invokes gangster act against accused

ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా 20 లక్షల మంది అశావహులు పాల్గోనదలచిన ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష ‘టెట్’ రద్దైన విషయం తెలిసిందే. చివరిక్షణంలో పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం అనేక ప్రాంతాలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారడంతో.. దీనిపై సమాచారం అందుకున్న ప్రభుత్వం పరీక్షలకు కొన్ని గంటల వ్యవధి ముందు పరీక్షలను రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం మథుర, ఘజియాబాద్, బులంద్‌షహర్ ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం.

కాగా లీకులకు సంబంధించి ఉత్తర్ ఫ్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి ఏకంగా 29 మందిని అరెస్టు చేసింది. వీరిపై జాతీయ భద్రత చట్టంతో పాటు గ్యాంగస్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రద్దు చేసిన పరీక్షను నెల రోజుల తర్వాత పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కోన్నారు. అయితే మళ్లీ పరీక్షలు రాసేందుకు ఏ అభ్యర్థి ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. దీంతో పాటు ఎలాంటి అదనపు ఫారాలను నింపాల్సిన పనిలేదని అన్నారు. ఇక అభ్యర్థులు తమ ఇళ్లకు అడ్మిట్ కార్డును చూపించి ఉచితంగా రాష్ట్ర బస్సులలో వెళ్లవచ్చునని తెలిపారు.  

కాగా ఇవాళ ఒకటి నుంచి ఎనమిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఆశావహులు రెండు బ్యాచులలో 2376 కేంద్రాలలో పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు, పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి లక్నో, మీరట్, వారణాసి, గోరఖ్‌పూర్ తదితర ప్రాంతాల్లో 23 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ప్రశ్నపత్రం నిర్వహణ ఏజెన్సీని అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని ఉపేక్షించబోమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వారిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేయడంతోపాటు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి వారి ఆస్తులను జప్తు చేస్తారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles