Subramanian Swamy calls Modi govt a failure ప్రధాని మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్: సుబ్రహ్మణ్యస్వామి సంచలన విమర్శ

Day after praising mamata banerjee subramanian swamy calls modi govt a failure

BJP Subramanian Swamy, BJP Rajya Sabha member, Modi govt failure, Subramanian swamy praises Mamata Benerjee, Subramanian Swamy economy, Subramanian swamy mamata banerjee, West Bengal, Tamil Nadu, Politics

Bharatiya Janata Party’s Rajya Sabha MP Subramaniam Swamy on Thursday came down heavily on the Modi government, stating that it had failed in nearly every aspect of governance. His statement came just a day after he met West Bengal CM and Trinamool Congress supremo Mamata Banerjee.

ప్రధాని మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్: సుబ్రహ్మణ్యస్వామి సంచలన విమర్శ

Posted: 11/25/2021 12:22 PM IST
Day after praising mamata banerjee subramanian swamy calls modi govt a failure

రాజకీయాలలో ఆరితేరినవారికైనా.. ముచ్చెమటలు పట్టించే వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కోట్టినట్టు మాట్లాడేస్తుంటారు. అయితే అది నుంచే వీరి విమర్శల దాడి ఉండదండి. అచి, తూచి అన్ని పరిశీలించి.. అధ్యయనాలు చేసి.. లోతుపాట్లు తెలుసుకుని.. వారిపై విమర్శల దాడిని సంధిస్తారు. ఇక వీరు అవినీతికి అమడదూరం ఉండటంతో పాటు.. అది ఎక్కడ కనిపించినా సహించకుండా ప్రశ్నిస్తుంటారు. వీరి ముక్కుసూటి మనస్తత్వం.. వీరిని రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేర్చకపోయినా.. వారు నమ్మిన సిద్దాంతం మాత్రం వారిని నిత్యం విజేతలుగానే నిలబెడుతుంది. అలాంటి అరుదైన నాయకుల్లో సుబ్రహ్మణ్యస్వామి ఒకరు.

తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యస్వామి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపి తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయాలను స్వాగతిస్తూనే వస్తున్న ఆయన.. ఆ తరువాత మాత్రం కొంత వ్యతిరేకించారు. ఉదాహరణకు పెట్రోల్, డీజల్ ధరలపై ఆయన సంధించిన విమర్శనాస్త్రం.. అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారింది. రావణుడు జన్మించిన శ్రీలంకలోనూ.. సీత పుట్టిన నేపాల్ లోనూ ఇంధన ధరలు తక్కువగా వుంటే.. రాముడు ఏలిన భారత దేశంలో మాత్రం ధరలు మండిపోతున్నాయని ఆయన వేసిన సెటైరికల్ ట్వీట్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది.

అలాంటిది ఆయన బుధవారం రోజున ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతను కలిసి.. తాను మమతాబెనర్జీతో ఎప్పట్నించో వున్నాను.. టీఎంసీలో చేరాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఇక ఒక్క రోజు తరువాత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అది అని ఇదని కాదని, అన్నింటిలోనూ దారుణంగా విఫలమైందని సుబ్రహ్మణ్యస్వామి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన తర్వాతి రోజే ఆయనీ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత వంటి విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న సుబ్రహ్మణ్యస్వామి.. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును ‘అపజయం’గా అభివర్ణించారు. అలాగే, పెగాసస్ డేటా భద్రతా ఉల్లంఘన విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. మమతాబెనర్జీపై ఓ వైపు సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు మోడీ ప్రభుత్వానికి ఏకీపారేశారు. ఆమెను జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు వంటి రాజకీయ దిగ్గజాలతో పోల్చారు. ఆమె చెప్పిందే చేస్తారని, చేసేదే చెబుతారంటూ పొగడ్తలు కురిపించారు. రాజకీయాల్లో ఇలాంటి గుణం చాలా అరుదని కీర్తించారు.

సుబ్రహ్మణ్యస్వామి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘మన అణ్వాయుధానికి చైనా భయపడకపోతే, వారి అణ్వాయుధానికి మనం ఎందుకు భయపడుతున్నాం?’’ అంటూ ఈ నెల 23న ట్వీట్ చేశారు. అంతకుముందు ధరల పెరుగుదలపై ఓ ట్విట్టర్ యూజర్‌ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయనకు (ప్రధానమంత్రి నరేంద్రమోదీకి) ఆర్థికశాస్త్రం తెలియదని అన్నారు. మోదీ ప్రభుత్వం పట్టనట్టుగా ఉందని, విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత విషయంలో భారతదేశ పరిస్థితి ఏమంత బాగోలేదన్నారు. చైనా మన భూభాగాన్ని దోచుకుంటున్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. భారతమాతను అణగదొక్కిన ఈ వ్యక్తులు చైనాను దురాక్రమణదారు అని పిలవడానికి ఇష్టపడడం లేదని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles