Choreographer Shiva Shankar master in Critical condition శివశంకర్ మాస్టార్ సహా ఆయన కుమారుడి అరోగ్య పరిస్థితి విషమం..

Choreographer shiva shankar master in critical condition after tests positive for covid 19

Shiva Shankar Master, Shiv Shanker Master family, Corona Virus, Covid-19, AIG Hospital, Asian Institute of Gastreoentrology, Hyderabad, cirme

Tollywood popular choreographer Shiva Shankar master tested positive for novel Coronavirus and his health condition is in critical stage. According to the sources, Shiva Shankar master was admitted to AIG hospital after testing positive for Covid-19 and undergoing treatment. As per the reports, 75 percent of his lungs are infected and is in critical condition now.

కోవిడ్ బారిన శివశంకర్ మాస్టార్.. ఆయన సహా కుమారుడి పరిస్థితి విషమం..

Posted: 11/25/2021 11:17 AM IST
Choreographer shiva shankar master in critical condition after tests positive for covid 19

కరోనావైరస్ మహమ్మారికి మన దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందన్న పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నా.. ఇప్పటికీ ఈ మహమ్మారి తన ప్రభావాన్ని చాటుతూ.. అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటూనే వుంది. కాగా ఇక ఓ వైవు థర్డ్ వేవ్ వార్తలు కూడా వినిపిస్తున్న తరుణంలో హెర్డ్ ఇమ్యూనిటీ వార్తలే ఎక్కువగా నమ్ముతున్న జనం కోవిడ్ జాగ్రత్త చర్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోవిడ్ ఇంకా మన దేశంలో ప్రభావాన్ని చాటుతోంది. కాగా తాజాగా టాలీవుడ్ సహా దక్షిణాధి చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాలకు కూడా కోరియోగ్రాఫీ చేసిన ప్రముఖ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ కూడా కొవిడ్ బారినపడ్డారు.

అయితే ఆయన కరోనా బారిన పడ్డారన్న వార్త అలస్యంగా తెలిసింది. నాలుగు రోజుల క్రితం ఆయన కరోనా చికిత్సలో భాగంగా హైదరాబాద్‌లోని ఏఐజీ (ఏషియన్ ఇనిస్టిట్యూట్ అప్ గ్యాస్ట్రోఎన్టాలజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రస్తుతం ఆయన అరోగ్య పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తలిపారు. ఆయన ఎప్పుడు కరోనా బారిన పడ్డారో తెలియదు కానీ.. నాలుగు రోజుల క్రితం ఆయన తన లక్షణాలను గుర్తించి.. కరోనా సోకిందని ఆసుపత్రిలో చేరారని తెలుసింది. అయితే ఆయన అసుపత్రిలో చేరే సమయానికే ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు చెప్పారు.

ఇదిలావుండగా శివశంకర్ మాస్టార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారినపడ్డారు. కుమారుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు. భార్య మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పదికిపైగా భాషల్లో పనిచేశారు. 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగులో మగధీర సినిమాలోని ‘ధీర.. ధీర..’ పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. నాలుగుసార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. నటుడిగానూ కొన్ని సినిమాలు చేశారు. టీవీ షోలకు జ‌డ్జ్‌గా వ్యవహరించారు.

శివశంకర్ మాస్టార్ సహా ఆయన కుమారుడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. విషయం తెలుసుకున్న రియల్‌ హీరో సోనూసూద్‌.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శివశంకర్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh