Kangana Ranaut posts a bold photo reacting to the FIR against her ఎఫ్ఐఆర్ పై కంగనా రనౌత్ సెటైరికల్ పోస్ట్ తో జవాబు..

Kangana ranaut posts a bold photo in a skimpy black thigh slit skirt reacting to the fir

Instagram, Kangana Ranaut, Kangana Ranaut Instagram, Kangana Ranaut Instagram stories, Sikh community, ‘Khalistani terrorists, Mumbai’s Khar police station, Amarjit Singh Sandhu, cirme

Kangana Ranaut and controversies go hand in hand and there’s no denying that. The Queen actress has been making headlines for comparing the Sikh community to Khalistani terrorists and an FIR was filed against her in regards to the same. The actress has finally broken her silence on it and in the most savage way!

ముంబైలో ఎఫ్ఐఆర్ పై కంగనా రనౌత్ సెటైరికల్ పోస్ట్ తో జవాబు..

Posted: 11/24/2021 09:18 PM IST
Kangana ranaut posts a bold photo in a skimpy black thigh slit skirt reacting to the fir

పైత్యం లేదా అహం తలకెక్కితే ఒక్కోసారి ఏం చేస్తున్నాం.. ఎందుకు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తాం. ఎంతలా అంటే సమాజంలో మనకున్నగౌరవ మర్యాదలను కూడా తోసిరాజుతూ.. మనకు మనమే కింగ్స్.. మనకెవరూ లేరు బాస్ అనుకుంటాం. అయితే అదృష్టం కలిసోచ్చేంత వరకు మాత్రమే ఈ వెకలి చేష్టలు కూడా కలసివస్తాయి. అదే ఒక్కసారి టైం బ్యాడ్ అయ్యిందా.? చేసిన మంచిచెడులన్నీ గుర్తుకువస్తాయి. ఔరా నేనానా ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేశానా అని ప్రతీ ఒక్క వ్యాఖ్యాన్ని తలచుకుని బాధపడాల్సిన రోజులు కూడా వస్తాయి.

అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ ఎప్పుడూ ఏదో వివాదంతో సహ‌వాసం చేస్తుంద‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సోష‌ల్‌మీడియాలో త‌న‌దైన స్టైల్‌లో కామెంట్లు పెడుతూ హాట్‌ టాపిక్‌గా మారుతూ ఉంటుంది కంగ‌నా. సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీంతో రైతులు ఓ వైపు ఆనందంతో సంబురాలు చేసుకుంటుంటే మ‌రోవైపు కంగ‌నా మాత్రం దీన్ని ఖ‌లిస్థానీ ఉద్య‌మం అని, రైతుల‌ను ఉగ్ర‌వాదుల‌ని పేర్కొంటూ..ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

ఈ నేప‌థ్యంలో కంగ‌నాపై సిక్కులు కేసు పెట్టారు. సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదయ్యింది. తాజాగా దీనిపై ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కంగ‌నా పెట్టిన మ‌రో పోస్ట్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్ విత్ స్లిట్ గెట‌ప్‌లో ఉన్న కంగ‌నా చేతిలో వైన్ గ్లాస్ ప‌ట్టుకుని బ్లాక్ చూపిస్తున్న స్టిల్ పోస్ట్ చేసింది. మ‌రొక రోజు మ‌రో ఎఫ్ఐఆర్‌. ఒక‌వేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వ‌స్తే..ఇంటి ద‌గ్గ‌ర నా మూడ్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. సున్నిత‌మైన రైతుల అంశంలో కంగ‌నా చేసిన కామెంట్ల‌పై క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్న వ్య‌క్తుల‌కు త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగా స‌మాధాన‌మిచ్చింది కంగనా. మ‌రి దీనిపై ఎవ‌రైనా స్పందిస్తారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh