Man tries to enter Lion's enclosure for sake of diamonds వజ్రాల కోసమే సింహం ఎన్ క్లోజర్ లోకి దిగాలని ప్రయత్నం..

Man tries to enter lion s enclosure in hyderabad zoo for sake of diamonds

Diamonds, diamonds in lion's enclosure, Hyderabad Zoo park, Nehru Zoological Park, G Sai Kumar, Moat area, Lion Enclosure, African Lion, Hyderabad, Crime

A 31-year-old mentally retarded man by name G Sai Kumar tried to enter African Lion's enclosure in Hyderabad's Nehru Zoological Park, had revealed to the police why he had entered the Lion's Enclosure. According to the police, He heard somebody talking of diamonds which wrer placed in Lion's Enclosure and wanted to see them.

ITEMVIDEOS: వజ్రాల కోసమే సింహం ఎన్ క్లోజర్ లోకి దిగాలని ప్రయత్నం..

Posted: 11/24/2021 11:42 AM IST
Man tries to enter lion s enclosure in hyderabad zoo for sake of diamonds

హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు ఏకంగా సింహాపు ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి.. సమయానికి జూ పార్కు సిబ్బంది రావడంతో కొద్దిలో మరణం నుంచి తప్పించుకోగలిగాడు. ఎన్ క్లోజరు పైభాగంలో ఉన్న గుహ వంటి నిర్మాణం మీదకు ఎక్కిన యువకుడు లోపలికి దిగేందుకు ప్రయత్నించాడు. తీరా సమాచారం అందుకున్న జూ సిబ్బంది పరుగుపరుగున వచ్చి యువకుడిని దిగకుండా అడ్డుకున్నారు. అయితే అప్పటికే సదరు యువకుడిని గుహపై ఉండటాన్ని గమనించిన సింహం.. ఆహారం కోసం ఆశగా ఎదురుచూసింది.

కొన్ని అడుగుల దూరంలో ఆహారం కనిపించడంతో అది కాస్తా వెనక్కు వెళ్లి ఎగిరేందుకు కూడా ప్రయత్నించింది. అదే సమయంలో జూ పార్కు సిబ్బంది రావడంతో యువకుడి లేచి వెళ్లాడు. కాగా యువకుడు దిగేందుకు ప్రయత్నిస్తున్నంత సేపు దిగేస్తాడేమోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే ఎన్ క్లోజరు వెనుక నుంచి వచ్చిన జూ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాయికుమార్ అనే ఈ యువకుడిని అదుపులోకి తీసుకున్న ఈ జూ పార్కు సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించారు.

కాగా బహదూర్ పూరా పోలీసుల విచారణలో పలు అసక్తికర విషయాలు వెలుగుచూశాయి.  అతడి పేరు సాయికుమార్. వయసు 31 సంవత్సరాలు. స్వస్థలం కీసర. అతడికి తల్లిదండ్రులు లేరు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తుంటాడు. కాగా, ఓసారి హోటల్లో టీ తాగుతుండగా, కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటూ సింహం వద్ద వజ్రాలు ఉంటాయని అనుకోవడం విన్నాడట. వారి మాటలు నిజమో కాదో తెలుసుకునేందుకు జూలో సింహాల ఎన్ క్లోజరులో దిగేందుకు ప్రయత్నించానని సాయికుమార్ వెల్లడించాడు. ఈ మాటలు విన్న పోలీసులు విస్మయానికి గురయ్యారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles