Prima facie no positive evidence against Aryan Khan అర్యన్ ఖాన్ బెయిల్ పై బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Aryan khan bail order out says no positive evidence to show conspiracy between accused

Aryan Khan drugs case, Aryan Khan news, Aryan Khan bail, Aryan Khan bail news, Bombay HC, cruise ship drugs bust case, Sameer wankhede, Nawab Malik, Bombay High Court, Drugs, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Crime

No evidence of a conspiracy between Aryan Khan, Arbaaz Merchant, and Munmun Dhamecha to commit drug-related offences, said the Bombay High Court in an order released today. The Court said that nothing objectionable was found in WhatsApp conversations between them.

ముంబై డ్రగ్స్ కేసు: అర్యన్ ఖాన్ బెయిల్ పై బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Posted: 11/20/2021 07:56 PM IST
Aryan khan bail order out says no positive evidence to show conspiracy between accused

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్టు ఎలాంటి సానుకూల ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్టయిన సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు తేల్చి చెప్పింది. అక్టోబరు 3న ముంబై సముద్ర తీరంలో ఓ క్రూయిజ్ నౌకలో జరుగుతున్న పార్టీని భగ్నం చేసిన ఎన్సీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉండడం సంచలనం సృష్టించింది.

ఈ కేసులో రెండు పర్యాయాలు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కాగా, మూడో పర్యాయం బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, జరిగిన విచారణలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందితులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచా మధ్య జరిగిన వాట్సాప్ చాటింగుల్లో ఎటువంటి అభ్యంతరకర అంశాలు లేవని పేర్కొంది. ఈ ముగ్గురు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కుట్ర పన్నుతున్నారని న్యాయస్థానం విశ్వసించే ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

నిందితులు ముగ్గురూ ఒకే క్రూయిజ్ నౌకలో ఉండడం ఒక్కటే వారు తప్పు చేశారనడానికి ఆధారం కాబోదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి నిందితుల నుంచి తీసుకున్న నేరాంగీకర వాంగ్మూలాలపై ఎన్సీబీ ఆధారపడరాదని, అవి చెల్లుబాటు కావని పేర్కొంది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ముంబై హైకోర్టు తీర్పుపై ఎన్సీపీ అధికార ప్రతినిధి, మ‌హారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి న‌వాబ్ మాలిక్‌ మరో మారుసంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అర్యన్ ఖాన్ కిడ్నాప్ జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోందని అభియోగాలు మోపారు. అయితే ఎవరు కి్డ్నాప్ చేశారన్న విషయాన్ని మాత్రం ఆయన వెలిబుచ్చలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles