Pakistan MLA Sania Ashiq Obscene Video Leaked నెట్టింట్లో మహిళా ఎమ్మెల్యే అసభ్యకర వీడియో.. పోలీసులకు పిర్యాదు

Obscene video of pakistani woman mla sania ashiq goes viral gets phone threats

Viral video, obscene video, Pakistan woman, Pakistan MLA, Imran Khan, Nawaz Shairf,Viral video, Obscene video, Pakistan woman, Pakistan MLA, Pakistan Muslim League-Nawaz (PML-N), Federal Investigation Agency, Taxila assembly, Punjab, Pakistan, Crime

A woman MLA of Pakistan found herself as a victim of a cyber crime with an obscene video, allegedly featuring her, going viral. Sania Ashiq, MLA of Pakistan Muslim League-Nawaz (PML-N) from Taxila assembly constituency of Punjab, Pakistan, had lodged a complaint with the police.

నెట్టింట్లో మహిళా ఎమ్మెల్యే అసభ్యకర వీడియో.. పోలీసులకు పిర్యాదు

Posted: 11/20/2021 06:26 PM IST
Obscene video of pakistani woman mla sania ashiq goes viral gets phone threats

కలలోనైనా కలగనని సాంకేతికత అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిని సద్వినియోగం చేసుకునేవారి సంఖ్య అధికమే అయినా.. దుర్వినియోగం చేయడంలోనూకొందరు సైబర్ నేరగాళ్లు పోటీపడుతున్నారు. పెరిగిన ప్రస్తుత కాలంలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సైబర్‌ క్రైమ్‌ బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్‌ మహిళా ఎమ్మెల్యే చేరారు. సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో దీని మీద సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు..

పాకిస్తాన్‌ పంజాబ్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యేకు చెందిన అశ్లీల వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ క్రమంలో ఆమె దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కంప్లైంట్‌ మేరకు పోలీసులు ఈ కేసులో ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో గురించి సానియాకు అక్టోబర్‌లో తెలిసిందని.. దీని గురించి ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిందని పాక్‌ మీడియా వెల్లడించింది.

అక్టోబర్‌ 26న సానియా ఫెడరల్‌ దర్యాప్తు సంస్థకు ఈ అశ్లీల వీడియో గురించి ఫిర్యాదు చేసింది. సోషల్‌ మీడియాలో వైరలవుతున్న ఓ అశ్లీల వీడియోలో తాను కనిపించేలా.. ఎవరో కావాలనే తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు వీడియోలో తనని మార్ఫ్‌ చేశారని తెలిపారు. వీడియో చూసిన సోషల్‌ మీడియా యూజర్లు.. దానిలో ఉన్నది ఎమ్మెల్యే సానియానే అని తెలిపారు. కానీ ఈ వార్తలని ఆమె ఖండించింది.  

సానియా ఫిర్యాదు తర్వాత మూడు వారాల దర్యాప్తు అనంతరం పోలీసులు ఇందుకు బాధ్యుడైన ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. కానీ అతడి వివరాలు బయటకు వెల్లడించలేదు. అంతేకాక వీడియోలో నటించిన స్త్రీ సానియానా లేక వేరే మహిళా అనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు మీడియా కథనాల ప్రకారం వీడియో ప్రత్యక్షం అయిన నాటి నుంచి సానియాకు అసభ్య ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని తెలిసింది. సానియా పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియంకు స్నేహితురాలు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆమె పలు అంశాలపై పని చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles