sabarimala temple pilgrimage suspended amid heavy rains కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు.. శ‌బ‌రిమ‌ల‌లో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

Sabarimala temple pilgrimage suspended amid heavy rains

Kerala rains, Sabarimala Temple, Sabarimala, Ayappan, pilgrim, Heavy Rains, Pamba, Pathanamthitta, Sabarimala, Travancore devosam Board, Ayyappas, Devotees, Kerala

Kerala's Pathanamthitta district is under the spell of heavy rains from the past few days which has resulted in the rise of water levels in prime rivers in the region including Pamba. Due to the heavy rains, the famous pilgrimage to the Lord Ayyappa temple in Sabarimala has also been suspended for a day today.

కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు.. శ‌బ‌రిమ‌ల‌లో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

Posted: 11/20/2021 03:33 PM IST
Sabarimala temple pilgrimage suspended amid heavy rains

బంగాళాఖాతంలో వరుస వాయుగుండాలతో ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. వరుణ జలప్రళయానికి సాక్షాత్తు కలియుగ వైకుంఠమైన తీరుమల క్షేత్రానికి భక్తులు వెళ్లే మార్గాలన్నింటికీ అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపటడంతో శ్రీవారి మెట్టుమార్గాన్ని ఆలయఅధికారులు మూపివేయగా, ఇక రోడ్డు మార్గాంలోనూ కొండచరియలు అడ్డుగా పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో శ్రీవేంకటవేశ్వరుడిని దర్శనం కోసం ఇప్పటికే కొండపైకి వెళ్తున్న భక్తులు అటుఇటు కాకుండా మధ్యలో చిక్కుకుపోయారు.

ఇక ఇదే సమయంలో అటు కర్ణాటకలోనూ ఇటు కేర‌ళ‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌కు కేర‌ళ‌లోని అన్ని జ‌లాశ‌యాలు నిండిపోయాయి. పంబ న‌దిలో వ‌ర‌ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. పంబ న‌దిలో వ‌ర‌ద ఉధృతి దృష్ట్యా.. పంబ‌, శ‌బ‌రిమ‌ల‌కు యాత్రికుల‌ను అధికారులు అనుమ‌తించ‌డం లేదు. పంబ‌, శ‌బ‌రిమ‌ల‌లో శ‌నివారం ద‌ర్శ‌నాలు నిలిపివేస్తూ జిల్లా కలెక్ట‌ర్ దివ్య ఎస్ అయ్య‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. యాత్రికులంతా స‌హ‌క‌రించాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం కోరింది. భ‌ద్ర‌త దృష్ట్యా మాత్ర‌మే యాత్రికుల‌ను అనుమ‌తించ‌ట్లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heavy Rains  Pamba  Pathanamthitta  Sabarimala  Travancore devosam Board  Ayyappas  Devotees  Kerala  

Other Articles