Man who attacked actor Shalu Chourasiya nabbed పోలీసులు అధుపులో నటిపై దాడి చేసిన అగంతకుడు

Man who attacked actor shalu chourasiya nabbed

Shalu Chourasiya, KBR Park attack, Shalu Chourasiya assault, Shalu Chourasiya mobile phone, Shalu Chourasiya iphone, Hyderabad Police, Telangana crime

Hyderabad City Police have reportedly nabbed the suspect who had attacked and robbed television actress Shalu Chourasiya at KBR National Park in Banjara Hills. The police, after scanning the footage of several CCTV cameras and analysing other evidence based on the clues given by the victim, finally laid their hands on him when he was moving in the neighbourhood.

పోలీసులు అధుపులో కేబీఆర్ పార్కులో నటిపై దాడి చేసిన అగంతకుడు

Posted: 11/20/2021 02:45 PM IST
Man who attacked actor shalu chourasiya nabbed

సినీనటి షాలూ చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. చౌరాసియాపై దాడి చేసిన వ్య‌క్తిని లైట్ బాయ్ బాబుగా పోలీసులు గుర్తించారు.  గతంలోనూ నేరచరిత్ర కలిగివున్న బాబు గత అదివారం ఈవినింగ్ వాక్ కు కేబిఆర్ పార్క్ వెళ్లిన నటిపై దాడి చేశాడు. అమె మెబైల్ ఫోన్ ను లాక్కుని పరుగు తీసిన అగంతకుడు స్థానిక కెమెరాల కంట కూడా పడకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు, అయినా బెట్టువీడని పోలీసులు అగంతకుడిని పట్టుకుని అరదండాలు వేశారు. కృష్ణాన‌గ‌ర్లో నివాస‌ముంటున్న బాబు ఇంట్లో.. షాలూ ఐ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లలోనూ బాబు నేరచరిత్ర కలిగివ్యక్తిగా వున్నాడు. అయితే హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని గొల్కోండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పాత నేరస్థుడిగా వుండటం..అటు గోల్కొండ కేసులో జైలుకు కూడా వెళ్లడంతో అతడ్ని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులకు అనుమానం రావడమే కాదు అరెస్టు చేయడానికి కూడా మార్గం సులభతరంగా మారింది. ఇక హైదరాబాద్ సహా అటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లోనూ బాబుపై కేసులు న‌మోదైన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

ఈ నెల 14(ఆదివారం)న‌ రాత్రి నటి షాలూ కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌ చేస్తుండగా… దుండగుడు దాడిచేసి, ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయిన ఘటన తెలిసిందే. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అమెకు మెడతో పాటు శరీరంపై పలు చోట్ల నిందితుడి గోళ్ల గాట్లు పడ్డాయి. అయితే అమె తనను దాడి చేయడమే కాక.. నిందితుడు తనను చెట్ల పొదల మధ్యలోకి కూడా లాక్కెళ్లడానికి ప్రయత్నం చేశాడని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shalu Chourasiya  KBR Park attack  Shalu Chourasiya assault  Hyderabad Police  Telangana  crime  

Other Articles