Kaikala Satyanarayana is in critical condition కైకాల సత్యనారాయణ అరోగ్య పరిస్థితి విషమం.. అపోలోలో చికిత్స

Veteran telugu actor kaikala satyanarayana is in critical condition in hyderabad

Kaikala Satyanarayana, Kaikala Satyanarayana hospitalised, Kaikala Satyanarayana critical condition, Kaikala Satyanarayana covid, Kaikala Satyanarayana health, Kaikala health, Kaikala hospital, Tollywood

Veteran Telugu actor Kaikala Satyanarayana's health condition deteriorated and his family members rushed him to Apollo Hospital in Jubilee Hills, Hyderabad, on November 20. According to reports, he is on a ventilator. Satyanarayana is 86 years old.

కైకాల సత్యనారాయణ అరోగ్య పరిస్థితి విషమం.. జూబ్లీహిల్స్ అపోలో చికిత్స

Posted: 11/20/2021 04:35 PM IST
Veteran telugu actor kaikala satyanarayana is in critical condition in hyderabad

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు కైకల సత్యానారాయణ. ఆయన నటన పరకాయ ప్రవేశాన్ని తలపింపజేస్తోంది, బహుముఖ కోణాలను అవిష్కరించగల చతురత వుందని కూడా నిరూపించుకున్నారు. మరటోడుగా, బ్రిటీషుగా, దుర్యోధనుడిగా, ఇలా ఎలాంటి పౌరాణిక పాత్ర నుంచి తండ్రిగా పాత్ర వరకు అన్నింటినీ తన నటనతో పండించారు. ప్రతినాయకుడిగా ఇచ్చినా.. క్యారెక్టర్ యాక్టర్.. అంటూ తేడాలు చూడిన కైకాల.. తన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తారన్న అభిప్రాయం తెలుగు ప్రేక్షకులలో వుంది.

కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా అది కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కే చెందుతుంది. దాదాపు ఆరు ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఆయ‌న గత నెల 30న త‌న ఇంట్లో జారిపడ్డారు. కింద ప‌డ‌డం వ‌ల‌న నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించి వైద్యం అందించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో అసుపత్రికి తరలించారు.  తాజాగా సీనియర్ నటుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా, కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు త‌న‌ ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విష‌యం తెలిసిందే. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles