Thousands Attend A Beggar’s Final Rites In Karnataka నిరాశ్రయుడి అంతిమయాత్రకు కదిలిన అశేష జనం..

Over 3000 people join funeral procession of homeless man in karnataka

Karnataka, Huchcha Basya, Ballari, Homeless man funeral Karnataka, Karnataka beggar funeral, Huchcha Basya funeral, Karnataka homeless man funeral procession, Bellary, Ballary, Bellari news, Karnataka news today, Huchcha Basya, Homeless Man, final journey, mentally challenged beggar, Hadagali town, Bellary

In a surprising update, thousands of people joined a beggar’s final journey in Karanataka. One Huchcha Basya, a 45-year-old mentally challenged beggar in Hadagali town near Bellary shared a special bond with the people of that town. They believe he brings good luck if you give him alms.

ITEMVIDEOS: నిరాశ్రయుడి ‘అదృష్ట బస్య‘ అంతిమయాత్రకు 3000 వేల మంది హాజరు..

Posted: 11/18/2021 05:33 PM IST
Over 3000 people join funeral procession of homeless man in karnataka

ప్రజాప్రతినిధులే కాదు ప్రముఖులు మరణించినా అంతిమయాత్రతో పాటు తుది వీడ్కోలు పలికే అంతిమ సంస్కరణలకు చాలా తక్కువ మంది బంధువులు, ఇరుగుపోరుగువారు, పరియస్థులు, స్నేహితులు హాజరవుతుంటారు. ఇక గత రెండేళ్లుగా కరోనావైరస్ మహమ్మారి అంక్షల నేపథ్యంలో పట్టుమని పదిమంది కూడా హాజరుకావడం లేదు. అయ్యో అలా పరమపదించారా.? అని అంగలార్చేవారే తప్ప.. నిజంగా వచ్చి బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని పంచేవారే కరువయ్యారు. ఇలాంటి ఘటనలు నమోదవుతున్న తరఉణంలో ఎవరికీ ఏమీ కాని ఓ మానసిక వికలాంగుడి అంతిమ యాత్రకు ఏకంగా ఊరు-వాడా కలిదినంత జనం హాజరయ్యారు.

క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌న‌గ‌ర జిల్లాలోని హ‌విన‌హ‌డ‌గ‌లిలో హుచ్చ‌బ‌స్య‌ (‘పిచ్చి బస్య) అనే నిరాశ్రయుడైన మానసిక వికలాండుగు.. ఎవరు కనిపించినా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అడిగి తీసుకునేవారు. అయితే ఎవరైనా ఎక్కవు డబ్బును ఇచ్చినా తాను మాత్రం ఒక్క రూపాయిని మాత్రమే తీసుకుని మిగిలిన చిల్లరను వారికి తిరిగిచ్చేసేవాడు. అయితే ఆయన మరణించారడన్న వార్తును తెలుసుకున్న హవినహడగలి జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని తమకు తాముగా చందాలు వేసుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమ యాత్ర చేశారు.

హుచ్చ‌బ‌స్య‌ ప‌ట్ట‌ణంలో ఎన్నో ఏళ్లుగా బస్య నివసిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను ప‌ట్ట‌ణంలో ప్ర‌తి ఒక్క‌రికి హుచ్చ‌బ‌స్య‌  గురించి బాగా సుపరిచితుడు. అంద‌ర్ని పేర్లతో ప‌ల‌క‌ల‌రిస్తూ చిన్నారులను మాత్రం ప్రేమతో పలకరించే బస్యను చిన్నారులు, మహిళలు అప్పాజీ అని ప్రేమగా పిలిచేవారు. అదేంటో సాధారణంగా ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే అసహ్యించుకునే సందర్భాలే ఎక్కువ కానీ హచ్చబస్య కనిసిస్తే చాలు అతిని వద్దకు వచ్చి మరీ రూపాయి ధ‌ర్మం చేసేవారు. ఇలా చేయ‌డం వల్ల తమకు మంచి జరుగుతుందని అక్కడి ప్రజల భావన.. అందుకే హ‌చ్చ‌బ‌స్య క‌నిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్క‌డి ప్ర‌జ‌లు.  

కాగా నవంబర్ 12న ఆయన ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆర్జీసీ బస్సు ఆయననను ఢీకొంది. అయితే స్థానికులు హుటాహుటిన బస్యను అసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో ఆయన చికిత్స పోందుతూ శనివారం మరణించారు. దీంతో ఒక్కసారిగా స్తానికంగా విషాధఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తమ వంతుగా స్వచ్చందంగా చందాలు వేసుకుని ఆయన అంతక్రియలను మాత్రం ఘనంగా నిర్వహించారు. బస్య అంత్యక్రియలకు ఏకంగా 3000 మందికి పైగా జనం హాజరయ్యారంటే అయనకు స్థానికంగా ఎంత ప్రాచుర్యం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆయన అంతిమ సంస్కారాలకు స్థానిక ప్రజలు స్వచ్చంధంగా హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Huchcha Basya  Homeless Man  final journey  mentally challenged beggar  Hadagali town  Bellary  

Other Articles