"Will Ensure No Injustice": J&K Govt Orders Probe హైదర్ పోరా ఎన్ కౌంటర్ పై విచారణకు అదేశించిన గవర్నర్

Will ensure no injustice j k govt orders probe

Altaf Bhat, Hyderpora Encounter, District magistrate probe, Investigation on Encounter, Mudasir Gul, controversial Hyderpora encounter, Hyderpora encounter news, Hyderpora news, Srinagar Encounter, Jammu and Kashmir, crime

The Jammu and Kashmir government ordered a magisterial inquiry into the controversial encounter in Hyderpora earlier this week. Lieutenant governor Manoj Sinha said suitable action will be taken as soon as a report is submitted in a time-bound manner. He also spoke about the government’s commitment to protecting the lives of civilians and ensuring there was no injustice.

హైదర్ పోరా ఎన్ కౌంటర్ పై జిల్లా మెజిస్ట్రేట్ విచారణ.. అదేశించిన గవర్నర్

Posted: 11/18/2021 04:20 PM IST
Will ensure no injustice j k govt orders probe

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశానికే తలమానికమైన జ‌మ్మూక‌శ్మీర్ లో నిత్యం అలజడి సృష్టిస్తూనే వున్న విషయం తెలిసిందే. ఇలా దేశంలోకి అక్రమంగా చోరబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునే ప్రక్రియలో వారు కాల్పులకు తెగబడటం.. ప్రతిగా భారత భద్రతా బలగాలు కడా కాల్పులు జరపడం.. ఈ క్రమంలో ఉగ్రవాదులు మరణిస్తుంటారు. అయితే గత సోమవారం జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతంలో జరగిన ఎన్ కౌంటర్ వివాదాస్పదంగా మారింది. ఈ ఎన్ కౌంటర్ ఘటనలో మరణించిందని ఉగ్రవాదులు కాదని, స్థానిక వ్యాపారులని స్థానికులు నిరసనలు చేపట్టారు.

శ్రీనగర్ లోని హైద‌ర్ పురాలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ వివాదాస్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు వ్యాపార‌వేత్త‌ల‌ను అన్యాయంగా కాల్చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆ ఇద్ద‌రూ అమాయ‌కుల‌ని వాళ్ల కుటుంబ‌స‌భ్యులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వం ఆ వివాదాస్ప‌ద ఎన్‌కౌంట‌ర్‌పై విచార‌ణ‌కు ఆదేశించింది. అద‌న‌పు జిల్లా మెజిస్ట్రేట్‌తో పోలీసు ఆప‌రేష‌న్‌పై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు జేకే ప్ర‌భుత్వం తెలిపింది. అయితే ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందిన ఆ ఇద్ద‌రికీ ఉగ్ర‌వాదుల‌తో లింకు ఉన్న‌ట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా హైద‌ర్‌పురా ఎన్‌కౌంట‌ర్‌పై విచార‌ణ నిర్వ‌హిస్తామ‌ని జేకే డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.

పోలీసులు నిర్వ‌హించిన ఎన్‌కౌంట‌ర్‌లో వ్యాపార‌వేత్త ఆల్తాఫ్ భ‌ట్‌, డెంట‌ల్ స‌ర్జ‌న్ ముద‌సిర్ గుల్ మృతిచెందారు. హైద‌ర్‌పురాలో ఉగ్ర‌వాదుల ఏరివేత స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు కూడా పోలీసుల తూటాల‌కు బ‌ల‌య్యారు. అయితే ఆ ఇద్ద‌ర్నీ ఉగ్ర‌వాదులే చంపిన‌ట్లు తొలుత పోలీసులు చెప్పారు. మ‌ళ్లీ మాట మార్చిన పోలీసులు.. ఆ ఇద్ద‌రూ ఎదురుకాల్పుల్లో చ‌నిపోయిన‌ట్లు వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదుల‌తో లింకు ఉన్న‌ట్లు ఆ ఇద్ద‌రిపై ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో కుటుంబ‌స‌భ్యులు ధ‌ర్నా చేప‌ట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles