తాను ఒకటి తలిస్తే దైవం మరోటి తలచిందన్న నానుడి తెలిసిందే కదా.. అచ్చంగా ఇలానే ఘటన ఓ వివాహ విందు కార్యక్రమంలో చోటుచేసుకుంది. అన్ని పెళ్లిళ్లలో జంటల మాదిరిగా సాధారణంగా కాకుండా తమ ఎంట్రీ కొంత భిన్నంగా వుండేలా ప్లాన్ చేసుకున్న కొత్త జంట.. తమ ప్లాన్ బెడిసికోట్టడంతో నలుగురిలో నవ్వుల పాలయ్యారు. ఈ కొత్త జంట చేసిన పనికి విందు పార్టీకి వచ్చిన అతిధులంతా ఒక్కసారిగా షాక్ అయ్యి.. తమ తమ స్థానాల్లో లేచి నిలబడి.. తలలు పట్టుకున్నారు. వధూవరులకు చెందిన కుటుంబసభ్యులు మాత్రం పరుగులు పెడుతూ వేదిక వద్దకు చేరుకుని కొత్తజంటను లేచి కూర్చోబెట్టారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కొత్త జంట పరిస్థితి ఎలా మారిందంటే అంతమందిలో తమకు నిజంగా గాయాలయ్యాయో కూడా తమ వారికి చూపించుకోలేని పరిస్థితిని ఎదుర్కోన్నారు. ఇక, ఇలాంటి వీడియోలు ఎక్కడెక్కడ లభిస్తాయో.. ఎప్పుడెప్పుడు వాటిని నెట్టింట్లో పెడదామా.? అని ఎదురుచూసే వారి అలానే ఈ వీడియోను నెట్టింట్లో పోస్టు చేశారు. అంతే ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియోను చూసిన నెట్ జనులు తమాయించుకోలేక నవ్వుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం కొత్త జంట పరిస్థితిపై అందోళన చెందుతున్నారు. ఇంకొందరు మాత్రం కొత్త జంట విపరీతమైన అలోచనకు ఫలితమిదే అంటూ తమ శాడిజాన్ని వెల్లగక్కుతున్నారు.
ఇంతకీ జరిగిందేమిటీ అన్న వివరాల్లోకి వెళ్తే.. ఓ కొత్త జంట వివాహానంతర పార్టీ ఏర్పాటు చేసింది. అందరిలా కాకుండా ఈ పార్టీలో తాము కొంచెం భిన్నంగా కనిపించాలనుకుంది. ఇందుకోసం వారు ఓ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. క్రేన్ బకెట్ ను అందంగా అలంకరించారు. దానిపై వారు కూర్చోగానే క్రేన్ వారిని పది అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లింది. కింద పార్టీ కోలాహలంగా జరుగుతుంది. పార్టీకి వచ్చిన అతిధులందరూ కొత్తజంటను చూస్తూ.. విందును ఆరగిస్తున్నారు. వారి గురించే చర్చించుకునేలా.. వారే టాపిక్ అప్ ది పార్టీగా, మారేలా చేసిన ఏర్పాట్లు హిట్ అయ్యాయి. ఇక అతిధులందరనీ చూస్తూ కొత్త జంట కూడా ముచ్చట్లాడుకుంటున్నారు.
అంతా సాఫీగా సాగిపోతున్న వేళ అనుకోని ఘటన జరిగింది. కొత్త జంట ముచ్చట్లలో ఒకరి గురించి మరోకరు అభిప్రాయాలను పంచుకుంటున్న తరుణంలో.. వారిని కిందకు దింపబోయారా..? లేక సాంకేతికంగా ఏదైనా సమస్య ఎదురైందో తెలియదు కానీ వారు కూర్చున్న క్రేన్ బకెట్ ఒక్కసారిగా కిందికి వంగిపోయింది. క్రేన్ బకెట్ నే అసరాగా చేసుకుని కూర్చున్న కొత్తజంట.. ఒక్కసారిగా కిందపడిపోయారు. అనుకోని ఈ హఠాత్ పరిణామం నుంచి వారు తేరుకునేలోపే.. వారి కోసం కింద ఏర్పాటు చేసిన టేబుల్ పైనే అమాంత పడిపోయారు. కొంతవరకు వారి అదృష్టం బాగుందోమో అనుకునే లోపు టేబుల్ కూడా ధ్వంసమై.. కిందపడిపోయారు.
ఇది చూసిన అతిథులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే లేచి ఎంతపని జరిగిపోయిందంటూ నెత్తిపై చేతులు వేసుకున్నారు. ఆ వెంటనే తేరుకుని వధూవరులను లేపి కూర్చోబెట్టారు. ఆ వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ జంటకు గాయాలయ్యాయా? ఆ తర్వాత ఏమైంది? పార్టీ కొనసాగిందా? అన్న వివరాలు తెలియరాలేదు. తమ పెళ్లి విందు జీవితంలో గొప్ప మధురానుభూతిగా మిగిలి పోవాలనుకున్న ఆ జంటకు ఈ ఘటన చేదు జ్ఞాపకంలా జీవితాంతం వెంటాడనుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ జంట ఎవరు? అన్న వివరాలు తెలియరాలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 08 | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... Read more
Aug 08 | గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం... Read more
Aug 08 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్ఫోర్స్మెంట్... Read more
Aug 08 | పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో... Read more
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more