ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. హస్తినకు పయనమైన చివరి రోజున రాష్ట్ర బీజేపి నేతలకు దిశానిర్ధేశం చేశారు. అమరావతి కోసం ఏడాదిన్నర కాలనికి పైగా ఉద్యమిస్తున్న రైతులకు పార్టీ నేతలు అండగా నిలవాలని, వారి రైతు మహాపాయయాత్రను ఏపీ బీజేపి నేతలు ఎక్కడికక్కడ స్వాగతిస్తూ.. మద్దతు ప్రకటించాలని దిశానిర్ధేశ్యం చేశారు. పాదయాత్రలో పాల్గోనాలని కూడా పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిగా ప్రకటించాలని తాము తీర్మానం చేసిన విషయంపై నాయకులు ఎందుకు డోలాయమానంలో పడ్డారని ప్రశ్నించారు.
అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని షా రాష్ట్ర బీజేపి నేతలకు స్పష్టమైన అదేశాలను ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా జాతీయ స్థాయిలో బీజేపి పార్టీ తీర్మాణం చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. వారికి అండగా నిలచి వారి ఉధ్యమాలకు తప్పక వెన్ను దన్నుగా నిలవాలని చెప్పుకోచ్చారు. అమరావతిపై మరో అభిప్రాయం ఎందుకని ప్రశ్నించారు. దీంతో రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ నేత అమరావతి రైతుల అంశాన్ని ప్రస్తావించడంతో ఆయన కొంత సీరియన్ గానే స్పందించారు.
అమరావతి కోసం ఉద్యమిస్తున్నది రైతులేనా.? కాదా.? అని ప్రశ్నించారు. వారు రాజధాని నిర్మాణం కోసం తమ భూములిచ్చిన విషయం వాస్తవమా? కాదా? అని అమిత్ షా ప్రశ్నించారు. అలాగే, ఉద్యమం చేస్తున్నది కూడా రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఒకసారి తీర్మానం చేశాక వెనక్కి తగ్గడం ఎందుకన్న కేంద్రమంత్రి.. పాదయాత్రలో పాల్గొనాల్సిందేనని నేతలను ఆదేశించారు. రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు తప్పిదాలను కేంద్రంగా చేసుకుని బీజేపి నేతలు టార్గటె్ చేయాలని కూడా ఆయన సూచించారు. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనే ఎంతసేపూ విమర్శించడం సరికాదని, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతంగా కృషి చేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు.
ఇక ఇతర పార్టీల నుంచి బీజేపిలోకి వచ్చి చేరుతున్న నేతలు.. పార్టీ సభ్యత్వం తీసుకోగానే వారు బీజేపి కార్యకర్తలు అవుతారని అన్నారు అమిత్ షా. ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీలోకి అనేక మంది ఇతర పార్టీల నేతలు వచ్చి చేరుతున్నారని, అయితే వారందరినీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే పనిలో నిమగ్నం చేశామని, దీంతో పార్టీ పూర్తి స్థాయిలో బలీయంగా తయారైందని అన్నారు. ఇక అస్సోంలోనూ హేమంత్ బిశ్వ శర్మ ఇతర పార్టీ నుంచి వచ్చి బీజేపిలో చేరారని, అయితే ఆయనిప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని.. పార్టీలో చేరిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పక్కనబెట్టే ప్రసక్తే లేదని అన్నారు. అలాగే, పొత్తులపైనా ఎవరూ నోరు మెదపొద్దని, ఈ విషయాన్ని అధిష్ఠానం తేలుస్తుందని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more