Ex-Minister Anil Deshmukh sent ot 14 days Judicial remand మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కు 14 రోజుల రిమాండ్

Former maharashtra home minister anil deshmukh sent ot 14 days judicial remand in money laundering case

Anil Deshmukh, Juditial custody, money laundering case, PMLA Court, cop Sachin Waze, param bir singh, deshmukh, Enforcement directorate, mumbai news, mumbai, maharashtra, anil deshmukh, Maharashtra, Crime

Former Maharashtra Home minister Anil Deshmukh was on Monday, sent to judicial custody for 14 days. He was arrested by the Enforcement Directorate on November 2 in a money laundering case and produced before the PMLA court after his custody ends today.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కు 14 రోజుల రిమాండ్

Posted: 11/15/2021 04:59 PM IST
Former maharashtra home minister anil deshmukh sent ot 14 days judicial remand in money laundering case

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌‌ (71) కు పీఎంఎల్ఏ న్యాయస్థానం ఇవాళ జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. న్యాయస్థానం తీర్పుతో మహారాష్ట్ర అధికార శివసేన ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో భాగమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలను షాక్ కు గురిచేసింది. తమ పార్టీకి చెందిన కీలక నేతపై కేంద్రం కావాలనే కేంద్ర స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను వినియోగించి జైలుపాటు చేసిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నవంబర్ 2న ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఆయనను విచారించారు.

అరెస్టయిన మాజీ ముంబై పోలీసు సచిన్ వాజే అభియోగాలను పరిగణలోకి తీసుకున్న ఈడీ ఆయనను ఈ విషయంలో లోతుగా విచారించింది. ఈ క్రమంలో ఇవాళ కస్టడీ పూర్తి కావడంతోన్యాయస్థానం ఎదుట హజరుపర్చగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.  ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మాజీ మంత్రిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇదే కేసులో సమన్లు జారీ చేసిన ఈడీ నవంబర్ 2న ఆయనను అదుపులోకి తీసుకుంది. దాదాపుగా 12 గంటల పాటు విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక న్యాయస్థానం ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన తరపు న్యాయవాది తన క్లయింట్ 71 ఏళ్ల వయస్సున్న వ్యక్తి కావడంతో పాటు పలు అరోగ్య రుగ్మతలు ఎదుర్కోంటున్నారని.. ఈ నేపథ్యంలో ఆయనకు జైలులోని ఆహారం కాకుండా తన ఇంటి బోజనాన్ని అనుమతించాలని కోరారు.

దీంతో పాటు ఆయనకు వెన్నుకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోంటున్నారని ఈ క్రమంలో ఆయనను నెలపై పడుకోలేరని, కాబట్టి ఆయనకు మంచాన్ని ఏర్పాటు చేసేలా జైలు అధికారులను అదేశించాలని కోరారు. అయితే, ఇంటి నుంచి ఆహారాన్ని తెప్పించుకునేందుకు చేసుకున్న విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. జైలు ఆహారాన్నే తీసుకోవాలని ఆదేశించింది. జైల్లోని ఆహారం వల్ల ఏవైనా సమస్యలు వస్తే అప్పుడు చూసుకుందామని తెలిపింది. అయితే జైల్లో బెడ్ ఏర్పాటు చేసేందుకు అనుమతించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles