KMC Juniors seeks help from PM Modi, KTR కాకతీయ మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్..

Ragging case reported in warangal s kakatiya medical college

kakatiya medical college freshers day, kakatiya medical college third year students, kakatiya medical college final year students, kakatiya medical college, ragging, boozing liquor, KMC, juniors, freshers day, warangal, Telangana, Crime

Tension mounted in Warangal Kakatiya Medical College after a third-year Medico student tagged Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, KTR, Telangana DGP, Warangal CP and a few others requesting to save them from ragging. According to the reports, a few days ago, third-year students arranged freshers day at New Mens hostel-1 and invited fourth-year students.

కాకతీయ మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్.. ప్రముఖులకు విద్యార్థుల ట్వీట్

Posted: 11/15/2021 01:04 PM IST
Ragging case reported in warangal s kakatiya medical college

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో మరోమారు ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. ఈ కాలేజీలో ర్యాగింగ్ తరహా ఘటనకు కేరాఫ్ సెంటరుగా మారిందని.. తమపై సీనియర్ విద్యార్థులు చేస్తున్న దాడుల నుంచి తమను కాపాడాలని కొరుతూ జూనియర్ విద్యార్థులు చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రోఫెసర్ల మధ్యఅధిపత్య పోరు.. ఈ ఘటనకు కేంద్రబింధువుగా మారుతోందన్న అరోపణలు వినబడుతున్నాయి. అయితే ఈ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో విద్యార్ధుల మధ్య ఫ్రోఫెసర్లు లడాయికి లంగరు వేస్తున్నారన్న అరోపణలు వినబడతున్నాయి.

తాజాగా నిర్వహించిన ఫ్రెషర్స్ డే పేరుతో సీనియర్ విద్యార్థులు కొందరు మద్యం మత్తులో తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఓ విద్యార్థి చేసిన ట్వీట్ తో రాష్ట్రంలోని కాలేజీల్లో లేకుండా పోయిన ర్యాగింగ్ భూతం మళ్లీ వరంగల్ మెడికల్ కాలేజీలో నిద్రలేచిందని విషయం బయటకు వచ్చింది. ఈ కాలేజీలో ఇటీవలి కాలం నుంచి వరుసగా వెటుగుచూస్తున్న ఘటనలు అక్కడి విద్యార్థుల వాతావరణాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థి ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ, రాష్ట్ర వైద్యసంచాలకుడిని ట్యాగ్ చేస్తూ ఓ విద్యార్థి ట్వీట్ చేశాడు.

అయితే కళాశాలలో జరుగుతున్న సీనియర్ల పెత్తనంపై జూనియర్ విద్యార్థులు ఎంతగా పిర్యాదు చేసినా.. కళాశాల యాజమాన్యం మాత్రం ఆ వార్తలను కొట్టిపడేస్తోంది. 2017 బ్యాచ్ కు చెందిన 50 మంది విద్యార్థులు మద్యం తాగి తమను వేధిస్తున్నట్టు ఆ ట్వీట్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, విద్యార్థి ఫిర్యాదును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాసు కొట్టిపడేశారు. ర్యాగింగ్ వార్త నిజం కాదన్నారు. కళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టల్ భవనాలు దూరదూరంగా ఉంటాయన్నారు. సీనియర్ విద్యార్థులు కొందరు జన్మదిన వేడుకలు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు.

అయితే మెన్స్ హాస్టల్ 1లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని విద్యార్థి ట్వీట్ చేయడంపై అప్రమత్తమైన హాస్టల్ మేనేజ్ మెంట్.. అలాంటి ఘటనలు ఏవీ నమోదు కాలేదని చెబుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై ఆరా తీసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి కళాశాలలో జరగాల్సిన ఫ్రెషర్స్ డేకు అనుమతి ఇవ్వొద్దని సూచించినట్టు తెలుస్తోంది. కాగా, విద్యార్థి ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మట్టెవాడ పోలీసులు నిన్న కేఎంసీలో విచారణ జరిపారు. ర్యాగింగ్‌పై విద్యార్థులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kakatiya medical college  ragging  boozing liquor  KMC  juniors  freshers day  warangal  Telangana  Crime  

Other Articles