Pawan Kalyan fires on closure of Aided Schools రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతపై పవన్ కల్యాణ్ సెటైర్లు

Pawan kalyan fires on ysrcp government over closure of aided schools

Jana Sena, Pawan Kalyan, Jana Sena party chief Pawan Kalyan, YSRCP Government, closure of Government schools, closure of Government Aided Schools, fruit seller in karnataka, Padma Sri award, Andhra Pradesh, Politics

Jana Sena party chief Pawan Kalyan fires on YSRCP Government over closure of Government and Aided Schools in state. He quotes that the fruit seller in karnataka constructs a school and is appraised with Padma Sri award, why the govt cannot.

రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతపై పవన్ కల్యాణ్ సెటైర్లు

Posted: 11/15/2021 12:36 PM IST
Pawan kalyan fires on ysrcp government over closure of aided schools

రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లను ఏపీ ప్రభుత్వం విలీనం చేసుకుంటుండటంపై అది నుంచి వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ.. విద్యార్థులకు విద్యాను దూరం చేస్తున్న విధానంపై తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఓ సామాన్యుడి తనకు ఎదురైన పరాభవంపై పోరాడుతూ.. పాఠశాలను నిర్మించి తన కలను సాకారం చేసుకున్నాడని, అందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడని తెలిపారు.

అయితే రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన చర్యలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. కర్ణాటకలోని మంగళూరు ప్రాతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి పాఠశాలను నిర్మించి... దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని పొందిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పవన్ ఉటంకిస్తూ... 'పండ్ల వ్యాపారి, పద్మశ్రీ పురస్కార గ్రహీత హరికేళ హజబ్బ తన సొంత సంపాదనతో పాఠశాలను ఎలా నిర్మించగలిగారు? ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తోంది' అంటూ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles