Punjab Govt to Compensate Farmers Held for Jan 26 Violence రైతులకు రూ.2 లక్షలు.. పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం

Punjab govt announces rs 2 lakh compensation to 83 people held for r day tractor rally

Republic day, Farmers protest, tractor rally, Farm Laws, Punjab CM Charanjit Singh Channi, compensation, Farm Laws, farmers tractor rally, Punjab CM, January 26th violence, republic day violence, Charanjit Singh Channi, Punjab, Politics

The Punjab government on Saturday said that it has decided to give Rs 2 lakh in compensation to all 83 people who were arrested by the Delhi Police following a tractor march against the Union government's 'three farm laws' on this year's January 26 (Republic Day) that turned violent leading to clashes between the police and farmers in the capital city in which dozens were injured.

రైతులకు రూ.2 లక్షలు.. పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం

Posted: 11/13/2021 08:58 PM IST
Punjab govt announces rs 2 lakh compensation to 83 people held for r day tractor rally

దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటకు ట్రాక్టర్ ర్యాలీతో వెళ్లిన రైతులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేయడంతో వారి కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. వారితో పాటు వారి కుటుంబాలకు జరిగిన అన్యాయంపై పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటకు వెళ్లి పోలీసుల కేసుల్లో చిక్కుని జైళ్ల పాలైన రైతులకు పరిహారంగా ఒక్కోక్కరికి ఏకంగా రూ.2 లక్షల చోప్పున అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీ ఓ ప్రకటన చేశారు.

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్ర‌భుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించి ఈ ఏడాది జ‌న‌వ‌రి 26వ తేదీన పంజాబ్‌, హ‌ర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్ ర్యాలీ నిర్వ‌హించిన రైతుల‌కు పంజాబ్ ప్ర‌భుత్వం ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. ఆ రోజున ట్రాక్ట‌ర్ ర్యాలీలో పాల్గొన్న 83 మంది రైతుల‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిలో ఒక్కొక్క‌రికి రెండేసి ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు పంజాబ్ సీఎం చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీ ప్ర‌క‌టించారు. నూత‌న రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న అన్న‌దాత‌ల‌కు త‌మ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles