Depression to cross coast between Tamil Nadu and AP తీరం గాటనున్న వాయుగుండం.. విద్యాసంస్థలకు సెలవు

Depression over bay of bengal to cross tamil nadu by nov 11 evening

Chennai Flood, chennai flood alert, chennai flood live, chennai flood alert live, chennai flood news, chennai rain, chennai rain today, tamil nadu rain, tamil nadu rain updates, tamil nadu rain alert, IMD weather alert, imd, imd alert, imd bulletin, imd forecast, tamil nadu floods, chennai rains, bay of bengal, depression over bay of bengal, low pressure area, heavy rain, heavy rainfall in Tamil Nadu, weather update tamil nadu, Chennai weather, IMD, Predictions, Heavy to Very heavy rainfall, chittor, nellore, Andhra Pradesh, Tamil Nadu

As Tamil Nadu copes with the aftermath of incessant rainfall, the IMD has said in its latest bulletin that the depression lying over southwest Bay of Bengal is expected to cross the coast of northern part of the state and south Andhra Pradesh by Thursday evening.

తీరం దాటనున్న వాయుగుండం.. తమిళనాడు, చిత్తూరు, నెల్లూరులో భారీ వర్షం

Posted: 11/11/2021 12:56 PM IST
Depression over bay of bengal to cross tamil nadu by nov 11 evening

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, అంధ్రప్రదేశ్ రాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జల దిగ్భంధంలో రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లు చిక్కుకున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం తమిళనాడు, అంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాయుగుండం తీరం దాటనుంది. దీని ప్రభావం చేత గత రెండు రోజులుగా రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది.

వాయుగుండం తీరం దాటే సమయంలో గంటలకు 45 కిలోమీటర్ల వేగంతో ఈతురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడులోని అనేక జిల్లాలతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలోనూ భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ డిఫ్యూటీ జనరల్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. దీంతో పాటు ఇటు అంధ్రపరదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయిని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం గంటలకు 21 కిలోమీటర్ల వేగంతో నైరుతి తమిళనాడు వైపు కదులుతోందని తెలిపారు.

ఈ సాయంత్రం తమిళనాడులోని కారైక్కల్, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట మధ్య కడలూరు వద్ద వాయుగుండం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఇవాళ సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావంతో గత అర్ధరాత్రి నుంచి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చంద్రగిరిలోని అమ్మ చెరువు ప్రమాదకరస్థితికి చేరగా, చైతన్యపురం చెరువు ఐదేళ్ల అనంతరం పరవళ్లు తొక్కుతుంది. తిరుపతిలోని మాధవ్ నగర్ లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. డీఆర్ మహల్, రైల్వే అండర్ బ్రిడ్జి (పశ్చిమ) కింద భారీగా నీరు నిలిచిపోయింది. శ్రీనివాస కల్యాణమండపాల వద్ద రోడ్డుపై నీరు భారీగా నిలిచిపోయింది. అటు నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన్నఓబులేసు ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2015లో సంభవించిన వరదల భీభత్సాన్ని తలచుకుని.. అలాంటి ఘటనలు పునరావృతం అవుతాయా.? అని అందొళన చెందుతున్నారు. చెన్నై సహా దాని సమీప 14 జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుడ్డలూర్, విల్లుపురం, చెన్నై, కాంచిపురం, చెంగళ్ పట్టు, తిరువళ్లూర్, వెల్లూర్, రాణిపేట్, తిరుపట్టూర్, నాగపట్టణం, మియినలద్దుత్తురయ్,కాళ్లకూర్చి, తిరువణ్ణామలై, సేలం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయని హెచ్చిరకలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles