Nobel Peace Prize winner Malala ties the knot in nikkah ceremony ఆశీస్సులు కోరుతూ మలాలా పెళ్లి ఫోటోలు.. ప్రముఖుల శుభాకాంక్షలు..

Priyanka katrina congratulates malala on wedding wishes her joy and happiness of married life

Malala Yousafzai, Pakistani activist, Nobel Peace Prize laureate, priyanka chopra, katrina kaif, Malala Yousafzai marriage, Malala Yousafzai husband, Malala Yousafzai wedding photos, Malala Yousafzai marriage pics, Malala Yousafzai Asser Malik, Asser Malik, Priyanka Chopra, Katrina Kaif, Reese Witherspoon, YouTuber Lilly Singh, wishes, celebrities

Nobel Peace Prize laureate Malala Yousafzai announced her wedding to Asser Malik. Sharing photos of the ceremony on social media, she wrote, “Asser and I tied the knot to be partners for life.” The Pakistani activist got married in Birmingham. After Malala shared the news, actor Priyanka Chopra, Katrina Kaif congratulated her and sent good wishes.

ఆశీస్సులు కోరుతూ మలాలా పెళ్లి ఫోటోలు.. ప్రముఖుల శుభాకాంక్షలు..

Posted: 11/10/2021 01:21 PM IST
Priyanka katrina congratulates malala on wedding wishes her joy and happiness of married life

పాకిస్థాన్ బాలికల విద్యకోసం ఉద్యమించిన ఉద్యమకారిణి, బాలికల హక్కుల ఉద్యమకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసి.. తనకు ఆశీస్సులను అందించాలని కోరింది. ఎందుకంటారా.. అమె కూడా ఒక్క ఇంటిదయ్యారు. తన భర్తతో కలిసి పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టగానే అవి కాస్తా వైరల్‌ అయ్యాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై పర్ఫామెన్స్ జనరల్ మేనేజర్ గా వున్న అస్సర్ మాలిక్ ను మాలాలా యూసుఫ్ జాయ్ వివాహం చేసుకున్నారు. 2019లో విరిద్దరూ తొలిసారిగా కలిసినా.. అంతకుముందు నుంచే వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారని తెలుస్తోంది.

ఇక 2020లో ఆయన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై పర్ఫామెన్స్ జనరల్ మేనేజర్ గా నియామకం అయిన తరువాత వీరిద్దరూ డేటింగ్ లో వున్నారని కూడా తెలుస్తోంది. వీరి విహాసంబ్రిటన్ లోని బర్మింగ్ హామ్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మలాలా.. ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజని అన్నారు. అస్సర్, తాను జీవిత భాగస్వాములమయ్యామని, తమ నిఖా నిరాడంబరంగా జరిగిందని పేర్కొన్నారు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణం సాగించడానికి సంతోషంగా ఉన్న తమకు ఆశీస్సులు పంపాలని కోరారు.

పాకిస్థాన్‌లో బాలికా విద్య హక్కు కోసం ఉద్యమించిన మలాలాను 2012లో అమె పాఠశాల బస్సులోకి చోరబడిన ఉగ్రవాదులు అమెపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అయితే అమెకు అరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుండటంతో బ్రిటెన్ అధికారులు అమెకు వైద్యం అందించారు. అమె కోలుకున్న తరువాత కూడా బాలిక విద్యాహక్కు కోసం ఉద్యమించింది. కాగా అమె వివాహం సందర్భంగా అమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు అందజేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, రీస్ వితర్ స్పైన్, యూట్యూబర్ లిల్లి సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles