Anand Mahindra shares inspiring video of a toddler ఆనంద్ మహీంద్రా ‘ప్రేరణాత్మక వీడియో’’ చూశారా.?

Anand mahindra posts inspiring video motivates netizens to overcome the impossible

Anand Mahindra, Mahindra Group chairman, anand mahindra monday motivational post viral video, anand mahindra tweets, Toddler video, obstacles, play area, motivational video, inspiring video, viral video, video viral, viral news, Trending video

Obstacles are a part of life and almost every individual faces some sort of hindrance or stumbling block while trying to achieve their goals. In an attempt to encourage his followers to stay motivated amid difficult times, business tycoon Anand Mahindra shared an old video of a child climbing an indoor rock wall.

ITEMVIDEOS: ఆనంద్ మహీంద్రా ‘‘స్ఫూర్తిదాయక వీడియో’’ చూశారా.?

Posted: 11/09/2021 02:58 PM IST
Anand mahindra posts inspiring video motivates netizens to overcome the impossible

ప్రముఖ ఇండ‌స్ట్రియ‌లిస్టు, మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మ‌హీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా వుంటాడు. తన దృష్టికి వచ్చిన సరదా వీడియోలను, ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో తన ఫాలోవర్స్ లో షేర్ చేసుకుంటాడు. ఇటీవల ఆయన 1972లో వ‌చ్చిన బాలీవుడ్ సినిమా ప‌రిచ‌య్ నుంచి ముసాఫిర్ హూన్ యారూన్ అనే పాట‌ను గుర్తు చేసుకుంటూ.. డ్రైవ‌ర్ లేడు.. నేను ఎక్క‌డికి పోతున్నానో తెలియ‌దు.. అంటూ క్యాప్ష‌న్ పెట్టి.. డ్రైవర్ లెస్ బైక్ వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఆయన షేర్ చేసిన మరో వీడియో ఎంతటి మిమాంసలో ఉన్న వ్యక్తికైనా ముందుకు అడుగై అంటూ సందేశాన్నిస్తూనే.. ప్రోత్సహించేలా వుంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు అని ముందుగానే చెప్పుకోచ్చిన ఆయన కొన్నేళ్ల క్రితం వీడియో అయినా.. ఇలాంటి వీడియోలకు డేట్ తో సంబంధం లేదని.. బూస్ట్ ఇచ్చారు. ఈ వీడియోలో ఓ చిన్నారి గోడ‌ను ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాడు. ప్లే ఏరియాలో ఉండే గోడను ఎక్కేందుకు చిన్నారి ఎలా పట్టుదలతో ప్ర‌య‌త్నించాడనే వీడియో అది. గోడను ఎక్కే క్రమంలో ఆ చిన్నారి ఎదుర్కోన్న ప్రయాస గురించిన వీడియో ఇది.

చిన్ానరి గోడపై ఎక్కేందుకు సంసిద్దుడై కాసింత పైకి ఎక్కగానే తనకు మరో మెట్టు మద్దతు లభించక.. కిందకు దిగాలన్న యోచన చేస్తాడు. అలా దిగేందుకు ఉపయుక్తుడైన చి్నారి మరోమారు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అంతే అనుకున్నదే తడవుగా ఇక ఒక్కో అడుగు వేస్తూ.. మరింత ముందుకు కదులుతాడు. ఇక చివరికి గోడను అందుకునే క్రమంతోనూ చివరి దశలోనూ కొంత ప్రయాసకు గురవుతాడు. మ‌రోసారి ట్రై చేసి పూర్తిగా పైకి ఎక్కుతాడు. ఆ వీడియోను షేర్ చేసిన బిజినెస్ టైకూన్.. చాలామంది ల‌క్ష్యాలు కూడా అసాధ్యం అన్న‌ట్టుగానే అనిపిస్తాయి. కానీ.. ఒక్క‌సారి నువ్వు నీ ల‌క్ష్యం కోసం అడుగు వేశాక నిన్ను ఎవ్వ‌రూ ఆప‌లేరు.. అంటూ క్యాప్ష‌న్ పెట్టారు.

నువ్వు అది చేయ‌లేవు అని.. నీవ‌ల్ల కాదు అని నిన్ను అంద‌రూ వెన‌క్కి నెట్టేస్తుంటారు. అవేమీ ప‌ట్టించుకోకు. నీ ప‌ని నువ్వు చేసుకుంటూ వెళ్లు.. విజ‌యం నీదే.. అని ఆ వీడియో కింద అంగ్లంలో వివ‌రించారు. అవి చదివితే ఖ‌చ్చితంగా ప్ర‌తిఒక్క‌రు మోటివేట్ అవుతారు. చాలారోజుల త‌ర్వాత ఓ మంచి మోటివేష‌న‌ల్ వీడియోను షేర్ చేశారు.. థాంక్యూ సార్.. అంటూ నెటిజ‌న్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తూ.. ఆనంద్ మహీంద్రకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మరెందుక ఆలస్యం.. మీరూ ఓ లుక్కేసయండీ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles