Edible oil prices declined after duty cuts తగ్గిన వంటనూనెల ధరలు.. కిలోకు రూ. 7 నుంచి రూ.20 వరకు..

Govt says edible oil prices show declining trend after duty cuts

edible oil, Oil rates, edible oil prices, crude edible oil, crude edible oil duty, basic duty, Food and Public distribution, cess, Central government

In an attempt to reign in the continuous price rise of edible oil, the Central government on Friday announced that it has cut the basic duty on crude palm oil, crude soybean oil, and crude sunflower oil to nil from 2.5 per cent. The ministry of consumer affairs, food & public distribution said that the agri-cess on crude soyabean oil and crude sunflower oil has been brought down from 20% to 5% while the agri-cess on crude palm oil has been reduced to 7.5%

తగ్గిన వంటనూనెల ధరలు.. కిలోకు రూ. 7 నుంచి రూ.20 వరకు..

Posted: 11/05/2021 08:54 PM IST
Govt says edible oil prices show declining trend after duty cuts

దేశంలో వంట నూనెల ధ‌ర‌ల గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని కేంద్ర ఆహార ప్ర‌జాపంపిణీ విభాగం తెలిపింది. నూనె రకాన్ని బ‌ట్టి కిలోకు క‌నిష్ఠంగా రూ.7 నుంచి గ‌రిష్ఠంగా రూ.20 వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్‌ డిపార్టుమెంట్‌ కార్య‌ద‌ర్శి సుధాన్షు పాండే వెల్ల‌డించారు. పామాయిల్‌, ప‌ల్లి నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్ర‌ధాన‌మైన నూనె ర‌కాల‌పై ధ‌ర‌లు త‌గ్గిన‌ట్లు తెలిపారు. కాగా, క‌రోనా దేశంలో కాలుమోపిన అనంత‌రం కొండెక్కిన వంట నూనెల ధ‌ర‌లు.. ఇప్పుడిప్పుడే దిగి వ‌స్తున్నాయి.

2020, మార్చిలో కిలో రూ.70-80 మ‌ధ్య ఉన్న వంట నూనెల ధ‌ర‌లు ఆ త‌ర్వాత క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కొండెక్కాయి. కిలో నూనె రూ.190-200 వ‌ర‌కు పలికింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా దిగివ‌చ్చి ప్ర‌స్తుతం 150-160 మధ్య ఉన్న‌ది. ఇప్పుడు ధ‌ర‌లు మ‌రికాస్త త‌గ్గ‌డంతో కిలో నూనె రూ.140కి అటుఇటుగా ఉండే అవ‌కాశం ఉన్న‌ది. అక్టోబరులోనే కేంద్రం పన్నులు తగ్గించినా ధరలు దిగిరాకపోవడంతో, కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.

వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు పరిమితి విధించింది. స్టాక్ పరిమితులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.  ఈ నేపథ్యంలో వంటనూనెల ధరలు కొద్దిమేర తగ్గాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, సోయాబీన్ నూనెల ధరలు తగ్గినట్టు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. అన్ని ప్రధానమైన వంట నూనెలకు ధర తగ్గింపు వర్తిస్తుందని తెలిపారు.

తగ్గింపు నూనెల వివరాలిలా:

*    పామాయిల్- రూ.20
*    వేరుశనగ నూనె- రూ.18
*    సోయాబీన్ నూనె- రూ.10
*    సన్ ఫ్లవర్ ఆయిల్- రూ.7

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : edible oil  Food and Public distribution  Oil rates  Central government  

Other Articles