Sameer Wankhede Removed From Aryan Khan case ముంబై డ్రగ్స్ కేసు విచారణ నుంచి సమీర్ వాంఖేడ్ ఔట్.!

Sameer wankhede removed from aryan khan drugs case probe

Shah Rukh Khan, Aryan Khan, Arthur Raod Jail, Mulakaat, bail denied, Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, shah rukh khan meet his son aryan khan, shah rukh khan aryan khan, Arthur Road jail Jail food, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Crime

The investigation into the Aryan Khan - Mumbai cruise drugs case has been transferred from the Mumbai zone of the Narcotics Control Bureau to a central team of the agency. Sameer Wankhede, zonal director of NCB's Mumbai unit, will no longer supervise the probe.

ముంబై డ్రగ్స్ కేసు విచారణ నుంచి సమీర్ వాంఖేడ్ ఔట్.!

Posted: 11/05/2021 08:01 PM IST
Sameer wankhede removed from aryan khan drugs case probe

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని అభియోగాలపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయ వర్తమాన నటి అనన్య పాండే సహా పలువురు ప్రముఖులను అరెస్టు చేసి సంచలనం రేపిన విచారణ అధికారి సమీర్ వాంఖేడ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సహా పలువురి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోన్న ఆయన.. కేవలం డబ్బు కోసమే ప్రముఖులను, వారి బిడ్డలను టార్గెట్ చేశారని అరోపణలు వచ్చాయి.

ఈ కేసులో మొత్తంగా 11 మంది అరెస్టు కాగా, అందులోంచి ముగ్గురు బీబేపి నేతలకు బంధువులను తప్పించి వారి నుంచి భారీగా మూటలను అందుకున్నారన్న అభియోగాలు కూడా వచ్చాయి. ఇక దీనికి తోడు సమీర్ వాఖాండే కు సన్నిహితుడైన ప్రైవేట్ డిటెక్టివ్ కు రైడ్ విషయాలు ఎలా తెలిసాయని, ఆయనకు అర్యన్ ఖాన్ తో సెల్పీ దిగేంత చనువు ఎందుకిచ్చారని ప్రశ్నలు ఉతన్నమయ్యాయి. ఇక ఆర్యన్ ఖాన్ తో ఫోన్లో ఎవరితోనే మాట్లాడించడంపై కూడా అరోపణలు వచ్చాయి, ఆర్యన్ ను అడ్డుపెట్టుకుని.. ఆయనను వదలాలంటే కోట్ల రూపాయలు ఇవ్వాలని డిటెక్టివ్ డీల్ కుదుర్చుకున్నారని కూడా ఆ మధ్య అరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తొలగించారు. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్ వాంఖడేపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ కేసు విచారణ జరుపుతున్న వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. వాంఖడేను తప్పించిన నేపథ్యంలో ఇకపై ఎన్సీబీకి చెందిన ప్రత్యేక బృందం ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో సంబంధం ఉన్న 5 కేసుల విచారణ కొనసాగించనుంది.

ఈ మేరకు ఎన్సీబీ ముంబయి జోన్ కు చెందిన బృందానికి అధికారాలు బదలాయించారు. ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడే ఎప్పట్లాగానే ఎన్సీబీ ముంబయి విభాగానికి జోనల్ డైరెక్టర్ గా కొనసాగనున్నారు. దీనిపై మంత్రి నవాబ్ మాలిక్ స్పందిస్తూ, ఇది ఆరంభం మాత్రమేనని, 26 కేసుల్లో నిగ్గుతేలాల్సి ఉందని అన్నారు. ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయిల్ అనే వ్యక్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు సమీర్ వాంఖడే నుంచి రూ.25 కోట్లకు డిమాండ్ వచ్చిందని ప్రభాకర్ వెల్లడించాడు. ఈ మేరకు ప్రభాకర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles