Diwali Impact: Delhi's air quality goes beyond red ప్రమాదకర స్థాయికి చేరువలో ఢిల్లీ వాయుకాలుష్యం

Delhi pollution off the charts after diwali itchy throat watery eyes

Air Quality Index, Delhi Air, Smog, Particulate matter, National Capital, Air Pollution, Diwali Effect, Itchy Throat, Watery Eyes, cardiovascular diseases, respiratory diseases, lung cancer. Health, wellness

From "severe" last night, the air quality in the Delhi has slipped into the ''hazardous'' category this morning, following the festival of Diwali. Continuing its upward trend, the city's air quality index, which stood at 382 at 4 pm yesterday, entered the severe zone around 8 pm as low temperature and wind speed allowed the accumulation of pollutants. The concentrations of Particulate Matter (PM) 2.5 stood at 999 per cubic metre, can cause cardiovascular and respiratory diseases such as lung cancer.

దీపావళి ఎఫెక్ట్: ప్రమాదకర స్థాయికి చేరువలో ఢిల్లీ వాయుకాలుష్యం

Posted: 11/05/2021 12:11 PM IST
Delhi pollution off the charts after diwali itchy throat watery eyes

దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్కడి ప్రజలు వాయుకాలుష్యంపై ఎలాంటి అవగాహన లేకుండా నిన్న రాత్రి కాల్చిన బాణాసంచా ధాటికి ఈ పరిణామం చోటుచేసుకుంది. బాణసంచాపై ఢిల్లీ నిషేధం విధించినప్ప‌టికీ ప్రజలు ఆ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా బాణాసంచా కాల్చారు. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. అటు ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం చేసిన విన్నపాలను గాలికి వదిలేయడంతో.. గాలి పీల్చితే రోగాలు వచ్చే స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. దీపావళి రాత్రే వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరువలోకి చేరిగా, ఇవాళ ఉదయం నాటికి ప్రజలపై కాలుష్య కాటువేసే స్థాయికి చేరింది.

ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌మాద‌క‌ర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఇవాళ ఉదయం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత పరిధి 25ను దాటింది. ఇక అదే సమయంలో పీయూఎస్‌ఏ, లోధి, మధుర రోడ్‌లు, ఐఐటీ ఢిల్లీ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్  ప్రాంతాల్లో గాలి నాణ్యత 396, 376, 379, 398, 395, 387గా ఉంద‌ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ఢిల్లీవాసుల దెబ్బకు పరిసర ప్రాంతాలైన ఫరిదాబాద్, గజియాబాద్, గుర్ గావ్, నోయిడాలలో నూ గాలి నాణ్యతలోని పర్టికులేట్ మ్యాటర్ (పీఎం) 424, 442, 423, 431గా నమోదైంది.

గాలి కాలుష్యం నేపథ్యంలో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినా.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీవాసులు ఆంక్షలను తుంగలో కలపడమే ఈ పరిణామానాకి కారణం. కాగా ఈ స్థాయికి వాయుకాలుష్యం చేరడంతో.. ఇవాళ ఉదయం ఢిల్లీపై పొగమంచు తెర కప్పేసింది. దీంతో గుండెజబ్బులు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం పొంచివుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ గాలిలో తిరిగే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందని తెలిపారు. అయితే కాలుష్యనియంత్రణ మండలి అధికారులు మాత్రం గాలి నాణ్యత రెండు రోజుల్లో తిరిగి సాధారణ స్థాయికి రావచ్చని భావిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles