Temples decked up for Karthika Masam తెలుగు రాష్ట్రాలలో సంతరించుకున్న కార్తీకమాస శోభ

Devotees in telugu states throng temples for karthika festivities

vemulavada, komravelli, allampur jogulamba, Srisailam, Vijayawada Durga temples, Karthika Masam, shivalayams, Lord Shiva, Kaleeshwaram, Sri Kalahasti, Yaganti, Bugga Ramalingeshwaram, Telangana, Andhra Pradesh, Devotional

Lord Siva temples across the telugu states witnessed a nominal rush of devotees on the first day of Karthika Masam. The devotees who are near by the coastal areas made a beeline to take a holy dip in Seas and Rivers, before visiting the temples.

తెలుగు రాష్ట్రాలలో సంతరించుకున్న కార్తీకమాస శోభ

Posted: 11/05/2021 11:23 AM IST
Devotees in telugu states throng temples for karthika festivities

దీపావళి పర్వదినం నాటికి మూడు రోజుల ముందు నుంచే తెలుగురాష్ట్రాల్లో అలుముకునే పండగ వాతావరణం.. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తోంది. ఇక పండగ పూర్తైన వెంటనే అర్థారాత్రి నుంచి అత్యంత పవిత్రమాసమైన కార్తీకంలోకి అడుగుపెడుతుండటం.. అందులోనూ ఆద్యాత్మికతకు నెలవైన శుక్రవారం రోజున కార్మీక ప్రారంభం కావడంతో రాష్ట్రంలో కార్తీక మాస శోభ సంతరించుకుంది. హిందూ మహిళలు తమ కుటుంబాలతో ఉదయాన్నే శైవాలయాలకు వెళ్లి కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

దీంతో తెలుగు రాషాల్లో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు మారుమ్రోగుతోంది. శివయ్యకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో భక్తులు లయకారుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస దీక్షలు, ఆకాశదీపాలు, కార్తీక మాసం మహాన్యాస రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు సహా ఇత్యాది పైజలను భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. దీంతో శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేసి త్రినేత్రుడిని దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

అలంపూర్‌లోని జోగులాంబ ఆలయాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తిక మాస పూజలు నిర్వహిస్తున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో కార్తిక శోభ నెలకొన్నది. జోగులాంబ ఆలయంలో కార్తిక దీపాలను వెలిగిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వరుని సన్నిధికి భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు  రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలు శ్రీశైలం, శ్రీ కాళహస్తీ, యాగంటి క్షేత్రాలలో కార్తిక మాసోత్సవాలను పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసోత్సవాల సందర్భంగా శ్రీగిరీశుడు మల్లికార్జున స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలంయంలోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తిక దీపారాధనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles