Video: Vijay Sethupathi attacked brutally by mystery man కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతిపై అగంతకుడి దాడి.! వీడియో వైరల్.!

Vijay sethupathi attacked brutally by mystery man shocking video

Vijay Sethupathi, Vijay Sethupathi airport attack, Vijay Sethupathi pa attacked, vijay sethupathi viral video, vijay sethupathi twitter, Vijay Sethupathi, Bengaluru airport, Body guards, social media, viral video, Kollywood, Movies, Entertainment

Vijay Sethupathi the sensational Kollywood star is super busy shooting for multiple films in multiple languages with barely time to rest. A shocking video of a mystery man attacking him brutally at an airport has gone viral causing huge concern to his fans.

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతిపై అగంతకుడి దాడి.! వీడియో వైరల్.!

Posted: 11/03/2021 09:20 PM IST
Vijay sethupathi attacked brutally by mystery man shocking video

ప్రముఖ కోలీవుడ్ హీరో, విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతికి ఊహించని ఘటన ఎదురైంది. బెంగుళూరు విమానాశ్రయంలో ఆయనకు ఊహించని పరాభవం ఎదురైంది. బెంగుళూరులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని అగంతకుడు ఆయనపై వైపు నుంచి వచ్చి దాడి చేశాడు. వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. అయితే విజయ్ బదులుగా అయన పీఏను తన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే విజయ్ బాడీగార్డ్స్ ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తన కార్యక్రమాలలో నిమగ్నమైన విజయ్ పై ఊహించ‌ని విధంగా అగంతకుడు దాడి చేయడంతో విజ‌య్ సేతుప‌తి ఒక్క‌సారిగా షాక్‌కు లోన‌య్యాడు. విమానాశ్రయంలో ఎయిర్ పోర్టు సిబ్బంది. సీఐఎస్ఎఫ్ అధికారులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న అనంత‌రం విజ‌య్ సేతుప‌తిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకెళ్లారు ఎయిర్ పోర్టు అధికారులు. కాగా, తనపై దాడి చేసిన వ్యక్తిని ఏమీ అనకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడు విజయ్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్‌ హీరోపై దాడి చేయడం కరెక్ట్‌ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ దాడికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Sethupathi  Bengaluru airport  Body guards  social media  viral video  Kollywood  

Other Articles