ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడి.. ముంబయ్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్న బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ ఎట్టకేలకు స్వేచ్చావాయువులను పీల్చుకున్నాడు. రెండు పర్యాయాలు బెయిల్ తిరస్కరణకు గురైన తరువాత.. ముంబై హైకోర్టులో ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. గురువారం రోజున ఆయనకు బెయిల్ లభించినా.. కోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకునేందుకు కొంత సమయం పట్టింది. దీంతో అర్యన్ ఖాన్ ఇవాళ అర్థర్ రోడ్డులోని కేంద్ర కారాగారం నుంచి ఇవాళ ఉదయం విడుదలయ్యాడు.
డ్రగ్స్ కేసులో ఈ నెల 2న ఎన్సీబి అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన జైలుకు పంపిన నాటి నుంచి దాదాపు నాలుగు వారాల పాటు ఆయన తన ఇంటికి దూరంగానే ఎన్సీబి అధికారుల కస్టడీ సహా జైలులోనే గడిపారు. 28 రోజుల తరువాత ఆర్యన్ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో షారుఖ్ అభిమానులు జైలు వద్దకు వచ్చారు. బెయిల్ అర్డర్ విడుదలలో కొంత జాప్యం జరిగిన కారణంగా నిన్న జైలు నుంచి విడుదల కావాల్సిన ఆర్యన్ ఇవాళ ఉదయం విడుదలయ్యారు. ఆర్యన్ ఖాన్ దాదాపు 22 రోజుల పాటు ముంబై కేంద్రకారగారమైన ఆర్థర్ జైలులో గడిపారు,
ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు ఆర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ లభించడంతో వారు కూడా ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, అర్యన్ ఖాన్ రాక కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు.. ఇంటికి విద్యుత్ దీపాలంకరణ చేసి ఘనంగా స్వాగత ఏర్పాటు చేశారు. ఆర్యన్ ఖాన్ కు స్వాగతం పలికేందుకు షారుక్ అభిమానులు భారీగా మన్నత్‌కు చేరుకున్నారు. 'వెల్కం ఆర్యన్' అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more