Juhi Chawla plays Key role in Aryan Khan's Bail అర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో జూహీ చావ్లా కీలక పాత్ర

Shah rukh khan s co actor juhi chawla plays key role in aryan khan s bail

Mumbai special court, Aryan Khan bail, Juhi Chawla, Shah Rukh Khan, Shah rukh khan legal team, Aryan Khan advocates, Mumbai High Court, NCB, mumbai cruise drugs case, Sameer wankhede, aryan khan Arthur Road Jail, Aryan khan bail, NCB court, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, sameer wankhede, ncb, Crime

Actor Juhi Chawla, Shah Rukh Khan's co-star in many movies, played an important part Friday in helping with his son Aryan Khan's release from jail.Juhi Chawla went to the Mumbai Sessions Court to stand surety for Aryan Khan and sign his bail bond of ₹ 1 lakh. That meant she would be legally responsible if at all Aryan Khan failed to pay the money.

ఆర్య‌న్ బెయిలుకు జూహీ చావ్లా హెల్ప్.. లీగల్ టీమ్ కు షారుఖ్ పార్టీ..

Posted: 10/30/2021 01:38 PM IST
Shah rukh khan s co actor juhi chawla plays key role in aryan khan s bail

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో పట్టుబడి.. ముంబయ్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్న బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ కు గురువారం ఎట్టకేలకు బెయిల్ లభించింది. ముంబై ఎన్సీబి ప్రత్యేక కోర్టుతో పాటు సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ప్రముఖ న్యాయకోవిదులు రంగ ప్రవేశం చేసి.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు, తమ వాదనలను బలంగా వినిపించారు. ఎన్సీబి అధికారులు ఆర్యన్ ఖాన్ వద్ద నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని.. అతడు మాదకద్రవ్యాలు తీసుకున్నాడని కనీసం వైద్య పరీక్షల్లోనూ నిరూపితం కాలేదని వాదించారు.

ఇరు తరపు వాదనలు విన్న తరువాత ఆర్యన్ ఖాన్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే గురువారం రోజున ఆయనకు బెయిల్ లభించినా.. అర్డర్ కాఫీ మాత్రం నిన్న న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే శుక్రవారం రోజున మాత్రం నటి జూహీ చావ్లా కీలక పాత్ర పోషించి ఆర్యన్ కు బెయిల్ రావడంలో దోహదపడ్డారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్‌ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చారు. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్‌ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్‌ బెయిల్ కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్‌ పేపర్లపై సంతకం చేశారు.

షారూఖ్‌- జూహీ చావ్లా ఎన్నోసినిమాల‌లో న‌టించ‌డంతో పాటు ప్ర‌స్తుతం ఐపీఎల్‌ టీం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) టీం ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె షారూఖ్ ఖాన్‌కి అండ‌గా నిలిచారు.ఆర్యన్‌ విడుదల అవ్వడం కోసం జూహీ చావ్లా నిజంగా పెద్ద ధైర్యం చేశారని చెప్పాలి. ఇదిలావుండగా, దాదాపుగా నెల రోజుల తరువాత తమ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్.. బెయిల్ వచ్చేలా తమ వాదనలు బలంగా వినిపించిన లీగల్ టీమ్ కు పార్టీ ఇచ్చారు.

ఆర్యన్‌కి బెయిల్‌ కోసం షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లనీ, లీగల్‌ టీం సతీష్‌ మనేషిండే బృందం ఎంతో కృషి చేసింది. దీంతో ఎంతో సంతోషంలో ఉన్న షారుక్‌ వారికి పార్టీ ఇచ్చాడని తెలుస్తోంది. ఆర్యన్‌ అరెస్టు తర్వాత లీగల్‌ టీంతో కలిసి మీడియాకి నవ్వుతూ ఫోటోలకి ఫోజులిచ్చాడు బాలీవుడ్ బాద్‌ షా. ఈ సందర్భంగా లాయర్‌ సతీష్‌ మనేషిండే మట్లాడుతూ.. ‘అరెస్టు అయినప్పుడు ఆర్యన్‌ దగ్గర ఎటువంటి డ్రగ్స్‌ దొరకలేదు. అతను మత్తు పదార్థాలు తీసుకోలేదు. దానికి ఎటువంటి సాక్ష్యం కూడా లేదని మేము వాదించడంతో సమ్మతించిన జస్టిస్‌ నితిన్‌ సాంబ్రే బెయిల్‌ మంజూరు చేశారు. సత్యమేవ జయతే’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles