Principal hangs kid upside down from building సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్.. కటకటాల పాలైన హెడ్ మాస్టార్..

Viral video of class 2 boy dangled by foot leads to up principal s arrest

class two student, dangled, School Head Master, Manoj Vishwakarma, shocking photograph, Arrest, Sonu Yadav, Juvenile Justice Act, mischievous student, student father, Ranjit Yadav, Mirzapur, Uttar pradesh, social media, Crime

The headmaster of a school in UP's Mirzapur has been arrested after a shocking photograph - showing him holding a young boy by his leg and dangling him from the top floor of the school building - was widely shared on social media.

సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్.. కటకటాల పాలైన హెడ్ మాస్టార్..

Posted: 10/29/2021 07:46 PM IST
Viral video of class 2 boy dangled by foot leads to up principal s arrest

విద్యార్థి దశలో అడుకోవడం, స్నేహితులతో పోట్లాడటం.. అల్లరిచేయడం, కొంటెపనులు చేయడం, ఎవరైనా కొత్తవస్తువు తీసుకువస్తే వారిపై దౌర్జన్యం చేసి.. దానితో కొంతసేపు గడపటం ఇలాంటి చేయడం సహజం. ఇలా చేస్తేనే వారు విద్యార్థులు. అయితే అల్లరి శృతిమించిన నేపథ్యంలో ఎలా ఉంటుందో తెలుసా.. అబ్బా వీళ్లేం పిల్లలు.. అంటూ వారిపై అరిచేయడం ఇంట్లో తల్లిదండ్రులకే కాదు స్కూళ్లో ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టార్లుకు కూడా విసుగు తెప్పిస్తోంది. అయితే తమ పిల్లలను కొట్టడం ఇష్టం లేని తల్లిదండ్రులు ఇప్పటికీ ఉపాధ్యాయులకు తమ పిల్లాడు బాగా అల్లరి చేస్తున్నాడని వాడిని దారిలో పెట్టాలని అప్పగించడం అన్ని పాఠశాలల్లో జరుగుతూనే ఉంటుంది.

 అయితే విద్యార్థులు అల్లరి చేస్తే కోట్టేస్తామంటూ ఉపాధ్యాయులు మందలించడం కామన్. విద్యార్థులు చ‌ద‌వ‌క‌పోతే.. వాళ్ల‌ను బుజ్జ‌గించ‌డ‌మో.. లేక బెదిరించ‌డ‌మో చేసి వాళ్లు చ‌దువుకునేలా చేయ‌డం టీచ‌ర్ల బాధ్య‌త‌. కానీ.. కొంద‌రు టీచ‌ర్లు దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకొని విద్యార్థులను ప్ర‌తి చిన్న విష‌యానికి దండిస్తున్నారు. దీని వ‌ల్ల చిన్నవ‌య‌సులోనే పిల్ల‌లు మెంట‌ల్‌గా డిస్ట‌ర్బ్ అవుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే చాలా జ‌రిగాయి అయినా కూడా ఉపాధ్యాయులు త‌మ తీరు మార్చుకోవ‌డం లేదు. తాజాగా యూపీలో ఇటువంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. రెండో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థిని హెడ్‌మాస్ట‌ర్ బిల్డింగ్ మీది నుంచి కింద‌కు వేలాడ‌దీశాడు.

మీర్జాపూర్‌లోని ఓ పాఠ‌శాల హెడ్‌మాస్ట‌ర్.. మ‌నోజ్ విశ్వ‌క‌ర్మ.. రెండో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థిని తీసుకెళ్లి బిల్డింగ్ మీది నుంచి త‌ల కిందులుగా వేలాడ‌దీశాడు. దీంతో అక్క‌డ ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. వెంట‌నే పిల్ల‌లంతా అక్క‌డ గుమికూడారు. ఆ పిల్లాడు భ‌యంతో ఏడుస్తున్నాడు. హెడ్ మాస్ట‌ర్ సారీ చెబితేనే కిందికి దించుతానంటూ ఆ పిల్లాడిని బెదిరిస్తున్నాడు. ఇంత‌లో తోటి విద్యార్థులు గ‌ట్టిగా అర‌వ‌డంతో ఆ హెడ్ మాస్ట‌ర్ పిల్లాడిని కిందికి దించాడు. అయితే.. హెడ్‌మాస్ట‌ర్ చేసిన పనిని కొంద‌రు ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో సామాజిక మాధ్య‌మాల్లో ఆ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అంతేకాదు పోలీసులు రంగంలోకి దిగి సదరు ప్రధాన ఉపాధ్యాయుడిని అరెస్టు కూడా చేశారు. అయితే విష‌యం తెలుసుకున్న పిల్లాడి త‌ల్లిదండ్రులు వెంట‌నే వచ్చి హెడ్‌ మాస్ట‌ర్‌కు మద్దతుగా నిలిచారు. ఆయన చేసింది తప్పే.. కానీ ఆలా చేసింది ప్రేమతోనే కానీ, పగ, ద్వేషంతో కాదని, అన్నారు. అయితే రంగంలోకి దిగిన బాలల హక్కుల సంఘాలు హెడ్ మాస్టారుపై పిర్యాదు చేయడంతో పోలీసులు జువెనైల్ జ‌స్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హెడ్ మాస్టారుకు రెండవ తరగతి విద్యార్థి పాఠం నేర్పించాడా..? లేక ఎవరికి ఎవరు పాఠం నేర్పించారని నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles