Nawab Malik takes swipe at Wankhede, Gosavi బాలీవుడ్ ను తరిమివేసేందుకు బీజేపి కుట్ర.!

Cruise drug case a bjp conspiracy via wankhede nawab malik

Aryan Khan, Drugs Case, Mumbai, nawab malik, Sameer Wankhede, kiran gosavi, Mumbai drugs bust case latest update, Nawab Malik, NCB, Bollywood, Yogi Adityanath, Uttar Pradesh, Politics, crime

A day after Aryan Khan was granted bail by the Bombay High Court, Maharashtra minister Nawab Malik Friday reiterated that the cruise drug case is “BJP conspiracy,” through NCB Zonal officer Sameer Wankhede, in order to defame Maharashtra, its people and the Bollywood industry.

ముంబైపై బీజేపి భారీ కుట్ర.. డ్రగ్స్ కేసు అందులో భాగమే: నవాబ్ మాలిక్

Posted: 10/29/2021 06:56 PM IST
Cruise drug case a bjp conspiracy via wankhede nawab malik

బాలీవుడ్ పరిశ్రమను ముంబై నుంచి త‌రిమివేసేందుకే దేశంలోని కాషాయ పార్టీ తెరవెనుక కుట్రలు పన్నుతోందని ఎన్సీపీ సీనియర్ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే ముంబై క్రూయిజ్ డ్ర‌గ్ కేసును తెర‌పైకి తెచ్చింద‌ని ఆయన ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక రాజధానిగా బాసిల్లుతున్న ముంబై మహానగర ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చేందుకే బీజేపి పార్టీ డ్ర‌గ్స్ కేసుతో కుట్ర‌కు పాల్ప‌డుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. డ్రగ్స్ కేసులో బడా బీజేపి నేతల సమీప బంధువులు ఉన్నా వారిని విడిపించి.. బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల పిల్లల చుట్టూనే కథను నడుపడానికి ఇదే కారణమని ఆయన అరోపించారు.

ఎన్సీబి అధికారి 10 నుంచి 11 మందిని ఈ కేసులో పట్టుకుని కేవలం 8 మందిని మాత్రమే అరెస్టు చేశారని ఏకంగా ఎన్సీబి ముంబై జోనల్ హెడ్ సమీర్ వాంఖేడ్ పై సంచలన అరోపణలు చేసిన నవాబ్ మాలిక్.. అప్పుడే ఆయనకు చూపించిన సినిమా వెనుక అసలు సినిమా ఇంకా బ్యాలెన్స్ ఉందని కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకే ర‌క్ష‌ణ కోరుతూ ఎన్‌సీబీ అధికారి స‌మీర్ వాంఖ‌డే బాంబే హైకోర్టును ఆశ్ర‌యించార‌ని న‌వాబ్ మాలిక్ ఆరోపించారు. తన తాజా అరోపణలకు బలం చేకూర్చేలా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యానాధ్ ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖుల‌తో నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చ‌ర్చ‌లు జ‌రిపిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. బాలీవుడ్‌ను ముంబై నుంచి దూరం చేసేందుకే బీజేపీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు.

ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ కార్యాల‌యానికి తీసుకువ‌చ్చిన కిర‌ణ్ గొసావి జైలు పాల‌వ‌డంతో ప‌రిస్ధితి మారిపోయింద‌ని వ్యాఖ్యానించారు. డ్ర‌గ్ కేసులో ప్ర‌త్య‌క్ష సాక్షి కిర‌ణ్ గొసావిని చీటింగ్ కేసులో పుణే పోలీసులు బుధ‌వారం రాత్రి అరెస్ట్ చేశారు. అక్టోబ‌ర్ 3న ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ సిప్‌లో ఎన్‌సీబీ దాడుల అనంత‌రం ఆర్య‌న్ ఖాన్‌తో గొసావి సెల్ఫీ వైర‌ల్‌గా మారింది. కాగా డ్ర‌గ్స్ కేసులో నిందితుల‌ను విడిచిపెట్టేందుకు ఎన్‌సీబీ అధికారులు పెద్ద‌మొత్తంలో లంచాలు డిమాండ్ చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్ల‌వెత్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aryan Khan  Drugs Case  Mumbai  nawab malik  Sameer Wankhede  NCB  Bollywood  Yogi Adityanath  Uttar Pradesh  Politics  

Other Articles