Widespread rain likely over peninsular India till month end బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంద్రకు 3 రోజుల వర్ష సూచన

Low pressure area lies over southwest bay of bengal

Rain, Weather, Tamil Nadu, India, Peninsular India, IMD, India Weather, Weather News, Weather Update, Latest Weather News, Latest Weather Forecast

The India Meteorological Department (IMD) informed that a low-pressure area has formed in central parts of South Bay of Bengal and it's expected to move towards Tamil Nadu coast in next 2-3 days. Moderate rainfall is expected over entire Tamil Nadu, Andhra Pradesh and Puducherry from October 29-31, said the IMD, Director General, Chennai.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంద్రకు 3 రోజుల వర్ష సూచన

Posted: 10/28/2021 11:11 AM IST
Low pressure area lies over southwest bay of bengal

దేశం నుంచి ఈశాన్య రుతుపవనాలు వెనుదిరుగుతున్న నేపథ్యంలో, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఈ నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక మహారాష్ట్ర సహా పుద్దుచేరిలలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్ర, యానం లలో భారీ వర్షాలు కురుసే అవకాశముందన్ని అన్నారు.

దీనికి తోడు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా పడుతుందని గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. దీంతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలోని కోస్తా తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. కాగా, ఉత్తర కర్నాటక, తెలంగాణ, లక్షద్వీప్, మహే, పుద్దుచేరి, ఖరైఖల్ ప్రాంతాలు మాత్రం పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పోడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీ వరకు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని వివరించింది. రేపు ఎల్లుండి విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  Weather  Tamil Nadu  India  Peninsular India  IMD  India Weather  Weather News  Weather Update  

Other Articles