NCB's ‘key witness Kiran Gosavi arrested in Pune అర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్

Mumbai cruise drugs case pune police arrest ncbs independent witness in aryan khan case

Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, kiran gosavi arrested, kiran gosavi detained, kiran gosavi held, kiran gosavi pune detained, kiran gosavi pune police, who is kiran gosavi, aryan khan drugs case, kiran gosavi aryan khan drugs case, ncb witness kirasn gosaviBJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Mumbai special court, Aryan Khan bail denied, Conspiracy angle, Aryan Khan advocates, Crime

The Pune city police have ‘nabbed’ Kiran Gosavi, the self-styled detective cited as an “independent witness” by the Narcotics Control Bureau (NCB) in the drugs-on-cruise case involving Aryan Khan, in connection with a cheating case lodged in 2018. Gosavi had gone incommunicado soon after his selfie with Aryan Khan went viral on social media and was reportedly travelling in Uttar Pradesh and had also expressed his intentions to surrender before UP Police.

ముంబై డ్రగ్స్ కేసు: అర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్

Posted: 10/28/2021 12:42 PM IST
Mumbai cruise drugs case pune police arrest ncbs independent witness in aryan khan case

ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ అగ్రనటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ సహా మరో ఏడుగురు సంపన్న కుటుంబాలకు చెందినవారిని ఎన్సీబి అధికారులు పట్టుకున్న కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కీలకసాక్షిగా పరిగణిస్తున్న కిరణ్ గోసవిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. 2018లో ఓ వ్యక్తిని విదేశాలకు పంపిస్తానని చెప్పి మోసం చేయగా, 2019లో అతనిపై చీటింగ్ కేసు నమోదైంది. అప్పట్నించి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు.. ఎన్సీబి కేసులో కీలక సాక్షిగా మారడంతో అలర్ట్ అయిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తరువాత అతడితో అంతకుముందే పోటో దిగిన కిరణ్ గోసవిని పోలీసులు గుర్తించారు. అత్యధికంగా ప్రాచుర్యం పోందిన ఈ కేసులో కిరణ్ గోసవి ఎన్సీబీ పేర్కోన్న సాక్షులలో కీలక సాక్షిగా వున్నారు. తనను తాను ప్రైవేట్ డిటెక్టివ్ గా చెప్పుకున్న కిరణ్ గోసవి.. తనకు బాడీగార్డుగా ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తిని కూడా పెట్టుకున్నాడు. కాగా ఇటీవల అర్యన్ ఖాన్ అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో కిరణ్ గోసవి వ్యవహరించిన తీరుపై బాడీగార్డు ప్రభాకర్ సెయిల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం లిసిందే.

ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు గోసవి, ఎన్సీబీ మధ్య డీల్ కుదిరిందని సెయిల్ వెల్లడించాడు. రూ.25 కోట్లు చేతులు మారనున్నాయని తెలిపాడు. ఈ మేరకు వారు అజ్ఞాత వ్యక్తితో పోన్ లో సంభాషిస్తుండగా, బయట వున్న తాను ఈ విషయాన్ని విన్నానని తెలిపాడు. దీనిపై సెయిల్ కోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించాడు. అర్యన్ ఖాన్ అరెస్టు జరిగిన రెండు రోజుల వ్యవధిలో ఓ వ్యక్తి నుంచి ఆయన రూ.50 వేలను పోందడం కూడా తాను చూశానని తెలిపాడు. తన అరోపణలకు తగు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది.

ఇదిలావుండగా, తాజాగా కిరణ్ గోసవిని చీటింగ్ కేసులోపూణే పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కేపీజీ సోల్యూషన్స్ అనే సంస్థను స్థాపించిన గోసవి.. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడు. కాగా ఒ వ్యక్తి నుంచి రూ. 3.5 లక్షలు తీసుకున్న తరువాత కూడా అతనికి ఉద్యోగం ఇప్పించకపోవడంతో.. 2019లో అతను పూణే పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్నించి తప్పించకు తిరుగుతున్న గోసవిని తాజాగా అర్యన్ కేసులో కిలక సాక్షిగా ఉండటంతో పాటు అతని పోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫూణే పోలీసులు అతడ్ని అరెస్టు చేసిన్నట్టు పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు.

అర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షిగా మారిన గోసవి తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబీ అధికారులు కోరే అవకాశాలు ఉన్నాయి. కిరణ్ గోసవిని విచారిస్తే డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక సమాచారం వెల్లడవుతుందని భావిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ అధికారుల అదుపులో ఉన్నప్పుడు గోసవి కూడా అతడి పక్కనే ఉండడం, అతడితో సెల్ఫీ తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. కాగా, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టులో నేడు కూడా విచారణ జరగనుంది. గత రెండ్రోజులుగా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles