Mother-in-law is “legal representative” under MV Act: SC అల్లుడిపై ఆధారపడిన అత్త కూడా చట్టబద్ద ప్రతినిధే: సుప్రీంకోర్టు

Mother in law residing with her son in law is legal representative under mv act sc

Supreme Court, APEX COURT, Motor Vehicle ACT, MV ACT, LEGAL HEIR, Mother in law, son in law, Dependent, Maintainance, Indian society, Kerala, Crime

A bench of Justices S A Nazeer and Krishna Murari said it is not uncommon in Indian society for the mother-in-law to live with her daughter and son-in-law during her old age and be dependent upon her son-in-law for her maintenance. ''Mother-in-law herein may not be a legal heir of the deceased, but she certainly suffered on account of his death.

అల్లుడి ఇంట్లో నివాసం ఉండే అత్త కూడా చట్టబద్ద ప్రతినిధే: సుప్రీంకోర్టు

Posted: 10/26/2021 06:45 PM IST
Mother in law residing with her son in law is legal representative under mv act sc

మోటారు వాహన చట్టంలోని కొన్ని లోసుగులను వెతుక్కుని.. ప్రమాదం బారిన పడిన వ్యక్తులకు, వారి కుటుంబసభ్యులకు భీమా డబ్బును చెల్లించే విషయంలో పలు బీమా కంపెనీలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. అయితే అలాంటి ఒక లోసుగుకు ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. భారతీయ చట్టం వేరు  సమాజం వేరు.. సమాజాన్ని అధారంగా చేసుకుని పరిస్థితులను అంచనా వేస్తూ ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి బీమా చెల్లించే కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది.

అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందేందుకు ఆమె కూడా అర్హురాలే అవుతుందని తేల్చి చెప్పింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ వ్యక్తి 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబానికి రూ. 74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ పరిహారాన్ని రూ. 48,39,728కి తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

దీంతో బాధితుడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 83,831 వేతనం తీసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అతడు 52 ఏళ్లకే మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, కాబట్టి కుటుకబ సభ్యులకు రూ. 85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇక అల్లుడిపై ఆధారపడి, అతని ఇంట్లోనే ఉంటున్న అత్త కూడా పరిహారం పొందేందుకు అర్హురాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

అల్లుడు, కుమార్తె వద్ద అత్త నివసించడం భారత సమాజంలో అసాధారణ విషయమేమీ కాదని, వృద్ధాప్యంలో పోషణ కోసం అల్లుడిపైనా ఆధారపడుతుంటారని పేర్కొంది. అతడు మరణించినప్పుడు ఆమె తప్పకుండా ఇబ్బందులు పడుతుందని తెలిపింది. కాబట్టి పరిహారం పొందేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 ప్రకారం అల్లుడికి ఆమె చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు పైన పేర్కొన్న మొత్తానికి 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  APEX COURT  Motor Vehicle ACT  MV ACT  LEGAL HEIR  Mother in law  son in law  Kerala  Crime  

Other Articles