Bombay HC adjourns hearing in Aryan Khan’s bail plea అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై విచారణ రేపు కొనసాగింపు

Aryan khan bail plea hearing to october 27th srk s son to stay in jail till wednesday

Mumbai special court, Aryan Khan bail denied, Conspiracy angle, Aryan Khan advocates, Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, Showik Chakraborty, Rhea Chakraborty, aryan khan Arthur Road jail Jail food, Aryan khan bail plea reserved, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, sameer wankhede, ncb, Crime

The Bombay High Court adjourned the hearing of Aryan Khan’s bail application in connection with the cruise ship drug bust case for Wednesday. Senior advocate and former Attorney General for India Mukul Rohatgi represented Aryan Khan, son of Bollywood actor Shah Rukh Khan, in his bail plea before Bombay HC.

ముంబై డ్రగ్స్ కేసు: అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై విచారణ రేపు కొనసాగింపు

Posted: 10/26/2021 07:57 PM IST
Aryan khan bail plea hearing to october 27th srk s son to stay in jail till wednesday

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై బాంబే హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది. ఎన్సీబి ప్రత్యేక మెజిస్టేట్ కోర్టుతో పాటు సెషన్స్ కోర్టు కూడా అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ తిరస్కరించాయి. ఈ క్రమంలో మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. తన వాదనల వినిపించే క్రమంలో ఎన్సీబి అధికారులు బాంబే హైకోర్టులో నివేదిక సమర్పించారు. అర్యన్ ఖాన్ కు బెయిల్ ఎందుకు ఇవ్వరాదో అందులో వారు పేర్కోన్నారు.

ఆర్యన్ ఖాన్ సమాజంలో చాలా పరపతి వున్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని.. దీంతో ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం వుందని లేదా న్యాయం నుంచి తప్పించుకున అవకాశాలు కూడా వున్నాయని తెలిపారు. అంతేకాక ఇప్పటికే సేకరించిన పలు ఆధారాలు విదేశాలలోని డగ్ర్స్ మాపియాతో అర్యన్ ఖాన్ కు సంబంధాలు వున్నాయిన స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అర్బాజ్ మర్చెంట్ నుంచి పోందిన మాదక ద్రవ్యాలను ఆయన తన వద్ద అట్టిపెట్టుకుని వాటిని ఇతరులకు అక్రమంగా పంపిణీ చేశాడని కూడా తమ విచారణలో వెల్లడైందని ఎన్సీబి నివేదికలో పేర్కోంది.

కాగా అర్యన్ ఖాన్ తరుపున బరిలోకి దిగిన ముకుల్ తన వాదనలను వినిపిస్తూ.. అర్యన్ ఖాన్ నుంచి ఎలాంటి మాదక ద్రవ్యాలను ఎన్సీబి అధికారులు స్వాధీనం చేసుకోలేదని అన్నారు. అంతేకాదు అతడు డ్రగ్స్ తీసుకున్నాడని ఎలాంటి వైద్య పరీక్షల్లోనూ నిరూపితం కాలేదు.. అలాంటప్పుడు తన క్లయింట్ ను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్సీబి అధికారులు సేకరించిన వాట్సాఫ్ చాట్ కూడా అర్యన్ ఖాన్ క్రూజ్ లోని రేవ్ పార్టీకి సంబంధించినది కాదని వాదనలు వినిపించారు. ఇక ఈ కేసులో తాజాగా ఎన్సీబీ ముంబై జోనల్ హెడ్ గా వున్న సమీర్ వాంఖేడ్ పై వస్తున్న అరోపణలతోనూ, మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలతోనూ, ప్రభాకర్ సెయిల్ చేసిన అరోపణలతోనూ తన క్లయింట్ కు సంబంధమే లేదని అన్నారు. ఇక ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం రేపు కూడా విచారన కొనసాగించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles