AIG's Novel Cooling Balloon Technique గుండె వేగం నియంత్రణకు కూలింగ్ బెలూన్ చికిత్స..

Aig uses new technique for irregular heart rhythm disorder

Heart patients, Heart beat, Dr. C. Narasimhan, AIG Hospital, cooling balloon technique, Hyderabad, South India, Medical Hub, asian institute of gastroenterology

Irregular heart rhythm disorder affects 50 lakh of Indians. To treat this disorder, specialists from the cardiology department of the Asian Institute of Gastroenterology (AIG) used a novel procedure here with success, using a “cooling balloon” in two patients.

గుండె వేగం నియంత్రణకు కూలింగ్ బెలూన్ చికిత్స.. ఏఐజీ వైద్యుల ఘనత

Posted: 10/26/2021 05:54 PM IST
Aig uses new technique for irregular heart rhythm disorder

గుండె జబ్బులకు నూతన బెలూన్‌ చికిత్స విధానాన్ని అమలుపర్చిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు రికార్డు సృష్టించారు. దక్షిణ భారతంలో మొదటిసారిగా కూలింగ్ బెలూన్ విధానం ద్వారా ఇద్దరు హృద్రోగులకు చికిత్స చేశారు. తద్వారా లయ తప్పిన గుండెను క్రమబద్దీకరించారు. ఈ మేరకు ఏఐజీ అసుపత్రి వర్గాలు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించాయి. గత వారం ఈ విధానంలో చికిత్స పొందిన ఇద్దరు రోగులను ఒక్క రోజులోనే డిశ్చార్జి చేసినట్లు తెలిపాయి. వారు వెంటనే వారు రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నట్లు వివరించాయి.

సాధారణంగా ఆరోగ్యవంతుల గుండె నిమిషానికి 72-84 సార్లు కొట్టుకుంటుంది. అయితే, కొందరిలో మాత్రం ఇది ఇంకా వేగంగా కొట్టుకోవడం లేదా నెమ్మదించడం జరుగుతుంది. అందుకు గుండె కండరాల్లో లోపాలే కారణం. గుండె వేగం నెమ్మదిస్తే పేస్ మేకర్ సాయంతో సాధారణ స్థితికి తేవొచ్చు. ఒకవేళ ఎక్కువగా కొట్టుకుంటే కనుక సాధారణ స్థితికి తీసుకురావడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో వేగాన్ని నియంత్రించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్ఎఫ్ఏ) సాంకేతికతను ఉపయోగించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ సాంప్రదాయ చికిత్స కన్నా రోగులకు ఇది సురక్షితమైన విధానం అని, ఏట్రియల్‌ ఫైబ్రిలేషన్‌ (ఏఎఫ్‌ఐబీ)ను నయం చేసేందుకు ఎంతో తోడ్పతుందని పేర్కొంది. వీరి కోసం ప్రత్యేకమైన ఏఎఫ్‌ఐబీ క్లినిక్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐజీలోని ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.నరసింహన్‌ తెలిపారు. ‘కూలింగ్ బెలూన్’ అనే సరికొత్త సాంకేతికతతో సమస్యను అధిగమించేలా చేశారు. ఆసుపత్రి హెచ్‌వోడీ, ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ సి.నరసింహన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ విధానంలో రోగి కాలి నరం నుంచి క్యాథటార్‌ను ఎడమ ధమని  వరకు పంపించారు. అనంతరం గుండె 3డీ ఇమేజ్ రూపొందించి అది లయ దెబ్బతినడానికి కారణమైన కండరాలను గుర్తించారు. ఆ ప్రదేశంలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సృష్టించడం ద్వారా కండరాల నుంచి విద్యుత్ ప్రేరణలు ముందుకు వెళ్లకుండా నియంత్రించారు. ఫలితంగా గుండె లయ సాధారణ స్థాయికి చేరుకుంది. ఈ విధానంలో ఒకసారి చికిత్స అందించిన తర్వాత గుండె మళ్లీ మునుపటి స్థాయికి వెళ్లే ప్రసక్తే ఉండదని డాక్టర్ సి.నరసింహన్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh