NASA Shares breathtaking image of a neutron star formation నక్షత్ర అవిర్భావ ప్రాంత దృశ్యాన్ని పంచుకున్న నాసా

Nasa s hubble telescope captures stunning image of colourful star forming region

nasa hubble, orion nebula, image capture, share instagram, punpkin spice, nasa, hubble, instagram, nasa instagram, orion, esa

NASA has shared a stunningly colourful image that shows a region in outer space where newborn stars are taking shape. It is splattered with hues of red and yellow, with twinkling stars dotting the region like diamonds and sparkling as the sun's rays pass through them.

కళ్లు చెదిరే నక్షత్ర అవిర్భావ ప్రాంత దృశ్యాన్ని పంచుకున్న నాసా

Posted: 10/25/2021 07:54 PM IST
Nasa s hubble telescope captures stunning image of colourful star forming region

అంతరిక్షంలో జరిగే చిన్న ఘటన కూడా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటిది రోదసిలో జరిగే అద్భుతమే కంటపడితే? దాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తాజాగా షేర్ చేసిన ఫొటో చూస్తే సరిగ్గా అదే భావన కలుగుతుంది. అంతరిక్షంలో కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్న దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో నాసా పంచుకుంది.

ఈ ఫొటోల్లో అంతరిక్షంలో నక్షత్రాలు జన్మించే ప్రాంతాన్ని హబుల్ టెలిస్కోప్ తన కెమెరాలో బంధించింది. నక్షత్రాలు రూపుదిద్దుకునే ఈ ప్రాంతంలో ఎరుపు, పసుపు కలిసిన రంగు మబ్బుల్లో నక్షత్రాలు వజ్రాల్లా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. వీటిని హబుల్‌ టెలిస్కోప్‌ కెమెరాలో బంధించినట్లు తెలిపింది.

1990లో అంతరిక్షంలోకి పంపిన ఈ టెలిస్కోప్‌ 20 ఏళ్లుగా 13 లక్షలపైగా అంతరిక్ష అద్భుతాలను మనకు అందించింది. ఇటీవల రెండు గెలాక్సీలో ఒకదాని ఆకర్షణకు లోబడి ఒకటి డ్యాన్స్‌ చేస్తున్నట్లు కదులుతున్న ఫొటోను కూడా నాసా షేర్ చేసింది. ఇప్పుడు కొత్తగా జన్మించిన నక్షత్రాలు రూపుదిద్దుకుంటున్న ఫొటోను పంచుకుంది. నక్షత్రాల పుట్టుక సమయంలో ఏర్పడిన దుమ్ము, మబ్బులు కూడా మెరుస్తూ ఉండటంతో ఈ ప్రాంతమంతా అస్తమిస్తున్న సూర్యుడి రంగులో కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nasa hubble  orion nebula  image capture  share instagram  punpkin spice  nasa  hubble  instagram  nasa instagram  orion  esa  

Other Articles