‘‘Centre should celebrate centenaries in fuel prices’’ ’’పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోండీ’’

Centre should celebrate centenaries in fuel prices p chidambaram jibe at centre

100 crore vaccinations, 100 etrol, 100 diesel, 1000 gas cylinder, Chidambaram, PM Modi, NDA govt, BJP Government, National politics

Taking a swipe at the central government over the rising fuel prices, former Finance Minister P Chidambaram on Monday said the Centre should celebrate the "centenaries" just like it did for 100 crore COVID vaccinations.

పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోండీ: చిదంబరం

Posted: 10/25/2021 07:00 PM IST
Centre should celebrate centenaries in fuel prices p chidambaram jibe at centre

పెట్రోల్, డీజిల్, సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ వాహనదారుల జేబులకు చిల్లుపెట్టిన కేంద్రంపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో కరోనాతో సామాన్యులు, పేదలు అల్లాడి.. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు పూటలా తినేందుకు కూడా లేక తల్లడిల్లుతున్న సందర్భంలో.. వారిని ఆదుకునే చర్యలు చేయాల్సిన ప్రభుత్వం.. చేతులెత్తేసి నిలబడిందని దుయ్యబట్టారు. రోజువారి కష్టం చేసినా కనీసం ఒక్క పూట కూడా తినలేని దుర్భర పరిస్థితులు దేశంలో ప్రస్తతుం నెలకొన్నాయని అన్నారు.

ఇంధన ధరల పెంపుతో దేశంలో కూరగాయల నుంచి అన్ని నిత్యావసర సరుకులధరలు మండిపోతున్నాయని.. పేదలను లేకుండా చేయడమే కేంద్రప్రభుత్వ లక్ష్యంగా మారిందా అని ఆయన ప్రశ్నించారు. కరోనాలో కుటుంబాల్లోని అర్జించే వ్యక్తులను కోల్పోయిన కుటంబాలకు అర్థికంగా అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఇప్పటికైనా వారిని అదుకునే అలోచన చేయడం లేదంటూ దుయ్యబట్టారు. 100 సంఖ్య వినగానే కేంద్రప్రభుత్వానికి పూనకం వచ్చేసి ఉత్సవాలను చేసుకుంటోందని విమర్శించారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రెండవ దశలో కరోనా మహమ్మారి రెట్టించి వేగంతో విజృంభించి చేయాల్సిన నష్టం చేసిందని అవేదన వ్యక్తం చేశారు.

దానిని కప్పిపుచ్చుకునేందుకు వాక్సీనేషన్లు బిలియన్ మార్కు చేరాయని శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మృతుల కుటుంబాలను అదుకునేందుకు ముందుకు కాని సర్కారు.. ఉత్సవాలను మాత్రం ఘనంగా జరుపుకుంటోందని మండిపడ్డారు. అదే తరహాలో 100 పదం వింటూన్న కేంద్రం.. పెట్రోల్ ధరలు వంద దాటిన తరుణంలోనూ.. డీజిల్ ధరలు కూడా వంద దాటిన క్రమంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా చేసుకోవాలని ఆయన దుయ్యబట్టారు. దేశంలోని పేదలు, సామాన్యులను సబ్సీడీ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా విపరీతంగా పెంచి వెయ్యికి చేరుకునేలా చేస్తున్నారని చిదంబరం ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles