ysrcp fan padayatra from gudivada to Tadepalli against corruption అవినీతిపై సీఎంకు వివరిస్తా: పాదయాత్రగా కదిలిన వైసీపీ అభిమాని

Ysr congress party fan padayatra from gudivada to tadepalli against officials corruption

Pallapu Srinivasa Rao, YSRCP Fan, Guntur, MRO Office, Chilakaluripeta, pasumarru, Gudiwada, Dhaniyalapeta, Anti-corruption padayatra, Family member certificate, CM YS Jagan, Government Officials, Andhra pradesh crime

ysr congress party fan hailing from Gudivada of Krishna district goes to CM camp Office at Velagapudi by walking as a protest agianst corruption of government officials.

క్షేత్రస్థాయిలో అవినీతిపై సీఎంకు వివరిస్తా: పాదయాత్రగా కదిలిన వైసీపీ అభిమాని

Posted: 10/26/2021 10:26 AM IST
Ysr congress party fan padayatra from gudivada to tadepalli against officials corruption

అవినీతి అంతం.. వైసీపీ పంతం అంటూ నినదించిన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అధికారులు నిసిగ్గుగా లంచాలు తీసుకుంటూ.. పైలు కదలాలన్నా.. పని జరగాలన్నా.. కనీసం ఓ ధ్రువీకరణ పత్రం జారీ కావాలన్నా చేయి తడపాల్సిందేనంటూ తెగేసి మరీ చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పును తీసుకురావాలనిభావించిన వైసీపి వీరాభిమాని.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను తమ ప్రభుత్వ అధినేత దృష్టికి తీసుకువచ్చేందుకు ఇచ్చేందుకు పూనుకున్నాడు.

తనకు జరిగిన అనుభావాన్ని.. తహసీల్దార్ కార్యాలయంలో తాను ఎదర్కోన్న పరాభవాన్ని.. సమాచార హక్కు చట్టం నుంచి తప్పించుకుంటున్న అధికారుల ఎత్తుగడల్ని వారి అతి తెలివితో చట్టం కూడా చాపచుట్టే విధానాన్ని వివరించడానికి కదిలాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. లక్షల రూపాయలను వేతనాలుగా పోందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు.. అది ప్రజాధనం అని మర్చి.. మళ్లీ ప్రజల నుంచి లంచాలను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ.. ఈ విషయాలను ముఖ్యమంత్రికి లేదా రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆయన ఎంచుకున్న మార్గం పాదయాత్ర.  

వివరాల్లోకి వెళ్తే.. గుడివాడలోని ధనియాలపేట ఆంజనేయస్వామి గుడి వీధికి చెందిన పల్లపు శ్రీనివాసరావు వైసీపీ అభిమాని. అతడి తల్లికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో మూడు సెంట్ల భూమి ఉంది. ఆమె మరణించడంతో ఆ భూమిపై తనకు స్వతహాగా రావాల్సిన హక్కు కోసం కుటుంబ సభ్యత్వ ధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ పత్రం ఇచ్చేందుకు అధికారులు తనను లంచం అడిగారని ఆయన అరోపించారు. దీంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరినా తప్పించుకునే ప్రయత్నాలే చేస్తున్నారని ఆయన అరోపిస్తున్నారు.

తనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే తప్పక చేతులు తడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సహా చట్టం కింద వివరాలు అడిగి.. నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని వాపోయాడు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని వివరించేందుకు నిన్న తాడేపల్లికి పాదయాత్ర ప్రారంభించాడు. ‘అధికారుల నిర్లక్ష్యం, లంచగొండితనం.. సీఎం సారూ.. నాకు న్యాయం చేయండి’ అని ప్లకార్డు పట్టుకుని మెడలో వైసీపీ కండువా వేసుకుని పాదయాత్ర ప్రారంభించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles