Hundreds of Pakistanis protest against inflation ఇమ్రాన్ గద్దె దిగాలంటూ ప్రజా నిరసలు.. ధరాఘాతం ఎఫెక్ట్..

Hundreds of pakistanis protest against imran khan govt for failing to check inflation

Muttahida Qaumi Movement-Pakistan, Pakistan, Pakistan inflation, Khalid Maqbool Siddiqui, Shahbaz Sharif, Pakistan Muslim League-Nawaz, Pakistan Tareek-e-Insaf, Imran Khan, Pakistan Prime Minister, Inflation, Jamaat-i-Islami, Shehbaz Sharif, Pakistan, Politics

Hundreds of Pakistani citizens protested against the failure of the Imran Khan Government to check inflation and unemployment. The activists of Jamaat-i-Islami and other parties came on the roads after Friday prayers in parts of Lower Dir, Battagram and Mohmand against the Imran Khan-led Pakistan Tareek-e-Insaf (PTI) government, reported Dawn.

ఇమ్రాన్ గద్దె దిగాలంటూ ప్రజా నిరసలు.. ధరాఘాతం ఎఫెక్ట్..

Posted: 10/25/2021 06:08 PM IST
Hundreds of pakistanis protest against imran khan govt for failing to check inflation

పాకిస్థాన్ లోని అధికార ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ప్రజల నిరసన సెగ బాగానే తాకింది. యావత్ దేశంలో ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. ప్రజాకర్షక విధానాలు, సంక్షేమ పథకాలు కానరానీ దేశంలో ధరాఘాతం మాత్రం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని ప్రజలు అక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. దీంతో దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతున్నారు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడమే ఈ నిరసనలకు కారణం.

పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమాంతం పెరిగిపోయిన ధరలతో పేదలు కడుపునిండా తినలేని పరిస్థితి దాపురించిందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌ఖాన్‌కు తెలియదని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జమీయత్ ఉలేమా-ఇ-ఇస్లాం సంస్థ నేత రషీద్ సుమ్రో డిమాండ్ చేశారు.

మరోవైపు, గతేడాది ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్ట్ చేసిన తమ నేతలను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌ వరకు నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్‌ను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. పోలీసులు వారిపై బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ క్రమంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు వారిపై దాడికి దిగారు. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles